విజయవాడ ‘గ్యాంగ్‌వార్’: పండు డిశ్చార్జిపై హైడ్రామా..!

విజయవాడ గ్యాంగ్‌వార్‌లో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పండు డిశ్చార్జిపై హైడ్రామా కొనసాగుతోంది. పండు డిశ్చార్జిని మరో రెండు రోజుల పాటు వాయిదా వేశారు వైద్యులు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జి చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. చేతికి గాయమైన చోట స్పర్శ లేదని పండు తెలిపారు. ఈ క్రమంలో మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలనుకుంటున్న వైద్యులు, మరో రెండు రోజుల పాటు డిశ్చార్జిని వాయిదా వేశారు. అయితే అతను డిశ్చార్జి అయితే వెంటనే అదుపులోకి […]

విజయవాడ గ్యాంగ్‌వార్: పండు డిశ్చార్జిపై హైడ్రామా..!

Edited By:

Updated on: Jun 09, 2020 | 2:27 PM

విజయవాడ గ్యాంగ్‌వార్‌లో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పండు డిశ్చార్జిపై హైడ్రామా కొనసాగుతోంది. పండు డిశ్చార్జిని మరో రెండు రోజుల పాటు వాయిదా వేశారు వైద్యులు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జి చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. చేతికి గాయమైన చోట స్పర్శ లేదని పండు తెలిపారు. ఈ క్రమంలో మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలనుకుంటున్న వైద్యులు, మరో రెండు రోజుల పాటు డిశ్చార్జిని వాయిదా వేశారు. అయితే అతను డిశ్చార్జి అయితే వెంటనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

మరోవైపు ఈ గ్యాంగ్‌వార్‌లో సందీప్, పండు వర్గాలను చెందిన 24 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..‌ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం సోమవారం నిందితులను పోలీసులు స్పాట్‌కు తీసుకుని వెళ్లారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు ఆరు ప్రత్యేక బృందాలను నియమించగా.. వీరు ప్రతి కోణంలోనూ తమ దర్యాప్తును సాగిస్తున్నారు. ఏ విషయాన్నీ బయటకు పోనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉంటే అసలు దేని కోసం ఈ రెండు గ్యాంగ్‌లు తలపడ్డాయన్న విషయంపై పోలీసులకు అంతుపట్టకపోవడం గమనర్హం.

Read This Story Also: కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట.. దక్షిణ మధ్య రైల్వే మరో వినూత్న ప్రయోగం