సచివాలయ సేవలకు ఐరాస సహకారం

| Edited By:

Aug 17, 2020 | 6:58 AM

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకొచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఐక్యరాజ్యసమితిని ఆకర్షించింది. ఈ క్రమంలో సచివాలయ సేవలకు సహకారం

సచివాలయ సేవలకు ఐరాస సహకారం
Follow us on

UNO focus secretariat services: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకొచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఐక్యరాజ్యసమితిని ఆకర్షించింది. ఈ క్రమంలో సచివాలయ సేవలకు సహకారం అందించేందుకు ఐరాస అనుబంధ విభాగాలు ముందుకు వచ్చాయి. దీని గురించి సచివాలయ శాఖ, ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి.

ఇదిలా ఉంటే సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వం మరో విడత శాఖాపరమైన శిక్షణ నిర్వహించబోతోంది. వివిధ అంశాలపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి శాఖ విధులకు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్‌ లేదా ఆ పైస్థాయి అధికారితో శిక్షణ ఇవ్వనున్నారు. 6 నుంచి 12 రోజుల పాటు ఈ శిక్షణ జరగనుండగా.. ట్రైనింగ్ ముగిసిన తరువాత ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించి వారి సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.  సెప్టెంబర్‌ 5 వరకు విడతల వారీగా శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపారు.

Read More:

తెలంగాణలో డిజిటల్ తరగతులు వాయిదా..

‘పుష్ప’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సాహో బ్యూటీ.?