తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..

| Edited By:

Jul 12, 2020 | 7:04 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా....

తెలుగు రాష్ట్రాల్లో టెర్ర‌ర్ సృష్టిస్తోన్న కరోనా.. తీవ్రంగా కేసులు న‌మోదు..
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో జులై 31 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌య‌నికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1813 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. వీటిల్లో రాష్ట్రానికి చెందినవి 1775 కేసులు కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 38 మందికి కరోనా తేలింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,235కి చేరింది.

కోవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, అనంతపురం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 309కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,393కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 12,533 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు 11,36,225 సాంపిల్స్‌ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తెలంగాణలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజే 1,714 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో ఇవాళ తొమ్మిది మంది మృతిచెందారు. ఒక్క హైదరాబాద్‌లోనే 736 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం పాజిటవ్‌ కేసుల సంఖ్య 33,402కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 348కి పెరిగింది. రాష్ట్రంలో 12,135 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కొలుకొని 20,919 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Read More: ప్ర‌ముఖ న‌టి రేఖ బంగ్లాకి సీల్..