‘కారు’ జోరు.. తెలంగాణ భవన్‌లో కోలాహలం!

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ కోలాహలంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో టీఆర్‌ఎస్ పార్టీ ముందంజలో హవా కొనసాగిస్తుండటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తున్నారు కార్యకర్తలు. అలాగే తెలంగాణ భవన్ వద్ద రంగులు చల్లుకుంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు డ్యాన్స్‌లు చేస్తున్నారు. కాగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో సందడి నెలకొంది. అటు భవన్‌లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి […]

కారు జోరు.. తెలంగాణ భవన్‌లో కోలాహలం!

Updated on: Jan 25, 2020 | 1:04 PM

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ కోలాహలంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో టీఆర్‌ఎస్ పార్టీ ముందంజలో హవా కొనసాగిస్తుండటంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తున్నారు కార్యకర్తలు. అలాగే తెలంగాణ భవన్ వద్ద రంగులు చల్లుకుంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు డ్యాన్స్‌లు చేస్తున్నారు.

కాగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో సందడి నెలకొంది. అటు భవన్‌లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ కె.కేశ్వరరావు. కాసేపట్లో తెలంగాణభవన్‌కు మంత్రి కేటీఆర్‌ కూడా చేరుకుంటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us