అల్లూరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గూడెం కొత్తవీధి మండలంలోని దారకొండ అటవీ ప్రాంతంలోని పెద్దపులి సంచరిస్తోందని గిరిజనులు భయాందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం డొంకరాయి నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో దారకొండ ఘాట్ రోడ్డుపై పెద్దపులి సంచరిస్తుండగా కొందరు ప్రయాణికులు వీడియో తీశారు.
దారాలమ్మ ఘాట్ రోడ్ లో పెద్దపులి సంచారం ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిసర గ్రామాలు, సంతల్లో అవగాహన పెంచుతున్నారు అటవీ శాఖ అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని పెద్దపులి పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి