తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు ఇవే!

| Edited By: Ravi Kiran

Dec 31, 2019 | 8:20 AM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా.. దాదాపు 120 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు అయ్యింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది. జనవరి 10న నామినేషన్ల చివరి తేదీగా ఎన్నికల కమిషన్ తెలిపింది. కాగా.. జనవరి 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, జనవరి 14న ఉపసంహరణకు […]

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు ఇవే!
Follow us on

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా.. దాదాపు 120 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు అయ్యింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది. జనవరి 10న నామినేషన్ల చివరి తేదీగా ఎన్నికల కమిషన్ తెలిపింది. కాగా.. జనవరి 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, జనవరి 14న ఉపసంహరణకు తుది గడువుగా కాగా.. జనవరి 22న పోలింగ్, జనవరి 25న ఓట్ల లెక్కింపు ఉటుంది.

అలాగే.. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 30న డ్రాఫ్ట్ ఫొటో ఎలక్టోరల్ రోలర్స్ రూపొందించనుంది. దీనిపై డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. అదే రోజు అఖిల పక్షంతో ఈసీ సమావేశమవుతుంది. జనవరి 1న మున్సిపల్ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలు ఉంటే పరిష్కారం చేస్తారు. జనవరి 4న ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తారు.