విమర్శలపై ఆవేదన.. కంటతడి పెట్టిన స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మంచి కార్యక్రమం చేస్తున్నా అర్థం చేసుకోకుండా కొందరు విమర్శలు చేస్తుండటం

విమర్శలపై ఆవేదన.. కంటతడి పెట్టిన స్పీకర్

Updated on: Jun 08, 2020 | 7:28 AM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మంచి కార్యక్రమం చేస్తున్నా అర్థం చేసుకోకుండా కొందరు విమర్శలు చేస్తుండటం బాధ కలిగిస్తోందంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగర్గా గ్రామంలో ఆయన 30 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోచారం మాట్లాడుతూ.. నష్టం వస్తుందన్న కారణంతో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అన్నారు. దీంతో తన తనయుడితో పాటు మండల ప్రజాప్రతినిధులను బ్రతిమాలి ఇళ్ల నిర్మాణం ముందుకు సాగేలా చూస్తున్నామని వివరించారు. ఇతర నియోజకవర్గాల్లో తొలి విడత ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదని, ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే కొందరు విమర్శలు చేస్తున్నారని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు.

లాటరీ పద్ధతిలో ఇళ్ల ఎంపిక జరుగుతుందని.. కొందరికి ముందు రావొచ్చు, మరికొందరికి ఆలస్యం కావొచ్చని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని స్పీకర్ పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఎవరైనా డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి జలాలలను నిజాంసాగర్‌కి తరలిస్తామని.. నిజామాబాద్ నియోజకవర్గంలో ఏటా రెండు పంటలకు నీరందుతుందని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Read This Story Also: ఏపీ సచివాలయ పోస్టుల రాత పరీక్షలు ఎప్పుడంటే..!

Loading...
Unable to load recommendations.
Follow Us