భారత దేశ పర్యటనకు వచ్చి లాకడౌన్ కారణంగా తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యా యువతి ఎస్తార్ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. గత కొన్ని నెలల క్రితం రష్యాకు చెందిన తల్లీ కూతుళ్లు ఒలివియా(55), ఆమె కూతురు ఎస్తర్(32) ఆధ్యాత్మిక పర్యటనకు భారతదేశానికి వచ్చారు. తల్లి ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో ఉండిపోగా తిరుపతికి వచ్చిన కూతురు ఇక్కడే ఉండిపోయింది. తిరుపతిలో ఓ న్యాయవాది కుటుంబం ఆమెను ఆదరించి భోజన, నివాస వసతి కల్పించింది.
లాకడౌన్ కారణంగా ఇక్కడ రష్యా యువతి ఎస్తార్ పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తన ప్రతినిధిని ఆమె వద్దకు పంపి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తల్లిని కూడా తిరుపతికి రప్పిస్తామని ధైర్యం చెప్పారు. రష్యన్ ఎంబసీతో సంప్రదించి ఇద్దరినీ వారి దేశానికి పంపేందుకు సహాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా ఎస్తర్ అభ్యర్థన మేరకు గురువారం టీటీడీ అధికారులు ఆమెకు శ్రీవారి దర్శనం కల్పించారు. తిరుపతిలో ఉండిపోయిన ఎస్తర్ విషయాన్ని తెలుసుకున్న పలువురు స్పందించారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారతి ట్రస్టు ఛైర్మన్ దీపా వెంకట్…ఆ తల్లీ, కూతుళ్లతో మాట్లాడి సహాయం అందిస్తున్నారు.
Read More:
ఆరోగ్య శాఖకు 6 కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్: మంత్రి కేటీఆర్