Rashtriya Ispat Nigam Vizag Steel CMD: విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండి పీ కె రథ్ ఈరోజు పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో విశాఖ స్టీల్స్ వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాలు చూసే కె సీ దాస్ ని తాత్కాలిక ఇంచార్జ్ సీఎండీగా నియమిస్తూ ఆర్ఐఎన్ఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజులలోపు కొత్త సీఎండిని నియమించనున్నారు. ఈసారి ఒక ఐఏఎస్ అధికారిని స్టీల్ ప్లాంట్ సీఎండీగా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం.
కాగా, ఇప్పటివరకు పనిచేసిన పీ కె రథ్ 2018, మార్చ్ లో సీఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో సంస్థ అభివృద్దితో పాటు పలు ఒడిదుడుకులను ఎదుర్కొంది. ముఖ్యంగా ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి పీ కె రథ్ సహకరిస్తున్నారంటూ రాజకీయపార్టీలతో పాటు కొన్ని కార్మిక సంఘాలు కూడా ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పదవీ విరమణ చెందడంతో కొత్త సీఎండీ ని నియమించేలోపు కె సీ దాస్ ని ప్లాంట్ ఇంచార్జ్ సీఎండీ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్ఐఎన్ఎల్.
Read Also… తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రేపట్నుంచి బ్యాంక్ పనివేళల్లో మార్పులు.. పూర్తి వివరాలు..