భక్తుల క్షేమం కోసమే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

| Edited By:

Oct 13, 2020 | 11:49 AM

భక్తుల క్షేమం కోసమే బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షతులు అన్నారు

భక్తుల క్షేమం కోసమే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Follow us on

Tirumala Brahmostavalu 2020: భక్తుల క్షేమం కోసమే బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షతులు అన్నారు. శ్రీవారి సంకల్పంతోనే వాహనసేవలు ఏకాంతంగా జరగనున్నాయని, దైవానుగ్రహం, శ్రీవారి వైభవం తగ్గుతుందని భక్తులు చింతించాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఏకాంత బ్రహ్మోత్సవాలు, మాడవీధుల్లో ఊరేగింపుకు ఎలాంటి వ్యత్యాసం లేదని వివరించారు. వాహన సేవలు ఏకాంతంగా చేసినా మాఢవీధుల్లో చేసినా శ్రీవారి వైభవం నభూతోనభవిష్యతిని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. కైంకర్యాలన్నింటినీ అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారని ఆయన వివరించారు. కాగా ఈ నెల 16 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే.

Read More:

Radhe Shyam: ప్రేరణగా పూజా హెగ్డే.. అదరగొడుతున్న లుక్‌

21న విజయవాడకు జగన్.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం