ఇంకా చంద్రబాబు ఆఙ్ఞలే పాటిస్తున్నారు.. టీటీడీ ఈవోపై రమణ దీక్షితులు ట్వీట్‌

| Edited By:

Jul 11, 2020 | 5:35 PM

టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌పై గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవో ఇప్పటికీ బాబు ఆఙ్ఞలనే పాటిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇంకా చంద్రబాబు ఆఙ్ఞలే పాటిస్తున్నారు.. టీటీడీ ఈవోపై రమణ దీక్షితులు ట్వీట్‌
Follow us on

టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌పై గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవో ఇప్పటికీ బాబు ఆఙ్ఞలనే పాటిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రమణ దీక్షితులు.. ”చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా 20 మందికి పైగా వారసత్వం అర్చకులను తొలగించారు. వారందరిని విధుల్లోకి తీసుకోవాలని గౌరవ హైకోర్టు టీటీడీని ఆదేశించింది. మమ్మల్ని మళ్లీ విధుల్లో చేరుస్తామని జగన్‌ కూడా మాటను ఇచ్చారు. కానీ టీటీడీ ఈవో, ఏఈవో ఇప్పటికీ చంద్రబాబు ఆఙ్ఞలను పాటిస్తూ.. కోర్టు ఆదేశాలను, జగన్‌ సూచనలను పాటించడం లేదు. మేము ఇప్పటికీ ఎదురుచూస్తున్నాం” అని కామెంట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కు వైఎస్‌ జగన్‌, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అకౌంట్లను ఆయన ట్యాగ్‌ చేశారు. కాగా టీటీడీ పనితీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో రెండేళ్ల క్రితం రమణ దీక్షితులుపై టీటీడీ ఈవో వేటు వేసింది. ఆయనతో పాటు పలువురు వారసత్వ అర్చకులను తొలగించిన విషయం తెలిసిందే.

ఇక రమణ దీక్షితులు పెట్టిన ట్వీట్‌కి స్పందించిన సాయి చైతన్య అనే నెటిజన్‌.. ”టీటీడీ ఈవోను మార్చారని నేను అనుకున్నా. ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలోని పురోహితులతో అసభ్యంగా ప్రవర్తిస్తారని, వారిని ఇబ్బంది పెడతారని ఈవోపై ఆరోపణలు ఉన్నాయి. న్యాయం నిదానంగా అవొచ్చు. కానీ న్యాయం జరగాలి. వైవీ సుబ్బారెడ్డి గారు దీనిపై చర్యలు తీసుకోండి” అని కామెంట్ పెట్టారు.