తెలంగాణ, రాయలసీమకు వర్ష సూచన

| Edited By:

Sep 09, 2020 | 11:12 AM

ఈనెల 13 నాటికి ప‌శ్చిమమ‌ధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డుతుంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. దీంతో ఈనెల 12 నుంచి రాష్ట్రంలో వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

తెలంగాణ, రాయలసీమకు వర్ష సూచన
Follow us on

అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో రాష్ట్రంలో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. ఈనెల 13 నాటికి ప‌శ్చిమమ‌ధ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డుతుంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. దీంతో ఈనెల 12 నుంచి రాష్ట్రంలో వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

రాష్ట్రంతోపాటు రాయ‌లసీమలోని కొన్నిప్రాంతాల్లో జ‌ల్లులు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. ఇవాళ‌, రేపు రాష్ట్రంలో అకడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల కదలికలు బలహీనపడ్డాయి.

సోమవారం అత్యధికంగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో 3.9, చందానగర్ లో 3.1, మన్నెగూడలో 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.