తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో కూడా వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.