మీ డబ్బును రెట్టింపు చేసే స్కీమ్..కచ్చితమైన లాభం..కేంద్రం గ్యారంటీ!

|

Jun 05, 2020 | 11:54 AM

భారత ప్రభుత్వం అందిస్తున్న పోస్టాఫీసు పథకాలు అత్యంత విశ్వాసపూరితమైనవి, భద్రమైనవి. కొన్ని పథకాలకు ఆదాయం పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. మరో సౌకర్యం ఏమంటే..ఏ నగరాల్లోకైనా ఖాతాలను బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పోస్టాఫీసు కల్పిస్తున్న పథకాల్లో..

మీ డబ్బును రెట్టింపు చేసే స్కీమ్..కచ్చితమైన లాభం..కేంద్రం గ్యారంటీ!
Follow us on

భారత ప్రభుత్వం అందిస్తున్న పోస్టాఫీసు పథకాలు అత్యంత విశ్వాసపూరితమైనవి, భద్రమైనవి. కొన్ని పథకాలకు ఆదాయం పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. మరో సౌకర్యం ఏమంటే..ఏ నగరాల్లోకైనా ఖాతాలను బదిలీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పోస్టాఫీసు కల్పిస్తున్న పథకాల్లో పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ) స్కీమ్‌లో అదిరిపోయే ఆప్షన్‌ అందుబాటులో ఉంది. ఇందులో మీ డబ్బుకు కచ్చితమైన లాభం వస్తుంది. పూర్తి రక్షణ కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది.

పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) స్కీమ్‌లో ఖాతాదారుల డబ్బు రెట్టింపు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వడ్డీ రేట్లను తగ్గించొచ్చు. లేదంటే పెంచొచ్చు. ఒకవేళ స్థిరంగా కూడా కొనసాగించొచ్చు. పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో కచ్చితమైన లాభం లభిస్తుంది. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ అందుబాటులో ఉంచిన వివరాల మేరకు.. కిసాన్ వికాస్ పత్ర మెచ్యూరిటీ గడువు 124 నెలలు. అంటే ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 124 నెలల కాలంలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే 10 ఏళ్ల 4 నెలలకు మీరు రెట్టింపు డబ్బు తీసుకోవచ్చు. కేవీపీ స్కీమ్‌లో వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.2 లక్షలు తీసుకోవచ్చు. మీకు డబ్బు అవసరం అనుకుంటే రెండేళ్ల ఆరు నెలలకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే కేవీపీ పత్రాలను ఒక పోస్టాఫీస్ నుంచి మరో ఫోస్టాఫీస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా మార్చుకోవచ్చు. ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.. రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఇక, ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి. జాయింట్ అకౌంట్ తీసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అలాగే మైనర్లు ఈ స్కీమ్‌లో చేరాలంటే..సంరక్షలు ఉండాల్సి ఉంటుంది. ట్రస్ట్‌లు కూడా ఈ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.