జయరాం కేసులో విచారణ వేగవంతం

|

Feb 19, 2019 | 5:15 PM

కృష్ణా: ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌ పోలీసులు నందిగామకు తీసుకు వచ్చి విచారించారు. జయరాంను హైదారాబాద్‌లో హత్య చేసి రాకేశ్‌రెడ్డి కారులో మృతదేహాన్ని కృష్ణా జిల్లా నందిగామలోని ఐతవరం గ్రామం వద్ద కారుతో సహా వదిలేసి వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. ఈ సీను మొత్తాన్ని రీ కనస్ట్రక్ట్ చేసేందుకు నిందితున్ని సంఘటనా స్థలం వద్దకు తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. విజయ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద నిందితుడు రెండు […]

జయరాం కేసులో విచారణ వేగవంతం
Follow us on

కృష్ణా: ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌ రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌ పోలీసులు నందిగామకు తీసుకు వచ్చి విచారించారు. జయరాంను హైదారాబాద్‌లో హత్య చేసి రాకేశ్‌రెడ్డి కారులో మృతదేహాన్ని కృష్ణా జిల్లా నందిగామలోని ఐతవరం గ్రామం వద్ద కారుతో సహా వదిలేసి వెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. ఈ సీను మొత్తాన్ని రీ కనస్ట్రక్ట్ చేసేందుకు నిందితున్ని సంఘటనా స్థలం వద్దకు తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. విజయ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద నిందితుడు రెండు బీర్లు కొనుగోలు చేసి వెళ్లినట్లు విచారణలో తేలటంతో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అనంతరం డీఎస్పీ కార్యాయలంలో కొద్దిసేపు నిందితున్ని విచారించారు.