Vizag: నాగేంద్రలో వికృత రూపం దాల్చిన కామం.. ఆఖరికి అందుకోసం పసరు మందు కూడా..

భర్త విపరీత కామవాంఛకు భార్య బలైంది. నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక చివరికి ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. వీడు మనిషా.. పశువా..! వైజాగ్‌లో భార్య ఆత్మహత్యకు కారణమైన నాగేంద్ర పైశాచికాన్ని చూస్తే ఇదే మాట అనాల్సివస్తోంది.. నాగేంద్ర ఫోన్‌ను చెక్‌చేసిన పోలీసులకు షాకింగ్‌ నిజాలు తెలిశాయి.

Vizag: నాగేంద్రలో వికృత రూపం దాల్చిన కామం.. ఆఖరికి అందుకోసం పసరు మందు కూడా..
Nagendra

Updated on: Feb 15, 2025 | 11:10 AM

విశాఖ వివాహిత వసంత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి నాగేంద్ర మొబైల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. నాగేంద్ర ఫోన్ నిండా పోర్న్ వీడియోలు ఉన్నట్లు తెలిసింది. నాగేంద్ర ఇంట్లో లైంగిక సామర్థ్యం పెంచే CONFIDO టాబ్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైంగిక పటుత్వం కోసం  పసరు మందులు కూడా వాడినట్టు గుర్తించారు. మొదట్లో ప్రోటీన్, విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పిన నాగేంద్ర.. భార్యకు నెలసరి రోజుల్లో కూడా టార్చర్ చేసినట్లు బంధువులు చెబుతున్నారు. శృతిమించిన అసహజ శృంగార వాంఛలతో నాగేంద్ర ఆమెను వేధించినట్లు సమాచారం.

మందులు వాడి పోర్న్ వీడియోల్లాగా తనతో వ్యవహరించాలని భార్యను టార్చర్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా… అత్తకు కాల్ చేసి కూతురు సహకరించట్లేదని వేధించనట్లు తెలుస్తోంది. భర్త వికృతి చేష్టలు, వేధింపులకు ఒత్తిడికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. నాగేంద్ర మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. ఇప్పటికే నాగేంద్రను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడంతో.. ఈనెల 24 వరకు రిమాండ్ విధించారు. నిందితుడ్ని సెంట్రల్ జైలుకు తరలించారు.

ఇది కూడా చదవండి:  ప్రేమికుల రోజున రైల్వే స్టేషన్‌లో పాడు పని.. పోలీసుల అదుపులో జంట..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..