ఇసుక ఫైట్.. వైసీపీ నేతలకు సవాల్ విసిరిన లోకేష్

| Edited By:

Nov 14, 2019 | 4:43 AM

బ్లూఫ్రాగ్‌ సంస్థ.. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించారన్న వార్తలు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ కార్యాలయంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్లూ ఫ్రాగ్ సంస్థపై మంగళగిరి సీఐడీ కార్యాలయంలో కేసు నమోదైందని.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపడుతున్నట్లు సీఐడీ డీఎస్పీ చిట్టిబాబు తెలిపారు. ఐటీ కోర్ టీం, సైబర్ క్రైమ్ సహకారాలతో డేటాను విశ్లేషిస్తున్నామని.. ఇసుక పోర్టల్‌ హ్యాక్‌లో […]

ఇసుక ఫైట్.. వైసీపీ నేతలకు సవాల్ విసిరిన లోకేష్
Follow us on

బ్లూఫ్రాగ్‌ సంస్థ.. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించారన్న వార్తలు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ కార్యాలయంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్లూ ఫ్రాగ్ సంస్థపై మంగళగిరి సీఐడీ కార్యాలయంలో కేసు నమోదైందని.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేపడుతున్నట్లు సీఐడీ డీఎస్పీ చిట్టిబాబు తెలిపారు. ఐటీ కోర్ టీం, సైబర్ క్రైమ్ సహకారాలతో డేటాను విశ్లేషిస్తున్నామని.. ఇసుక పోర్టల్‌ హ్యాక్‌లో బ్లూఫ్రాగ్‌ పాత్రపై విచారణ కొనసాగుతోందన్నారు.

అయితే బ్లూ ఫ్రాగ్ సంస్థకు లోకేష్‌కు లింకులున్నాయంటూ వార్తలు రావడంతో.. ఈ సోదాలకు రాజకీయ రంగు పులుముకుంది. దీంతో నారా లోకేష్ డైరక్ట్‌గా స్పందించారు. ఇది వైసీపీ నేతల ఎత్తుగడ అని..కావాలనే ఈ దుష్ప్రచారానికి ఒడిగట్టారని మండిపడ్డారు. గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారని, నిరూపించమంటే పారిపోయారంటూ ఎద్దేవాచేశారు. చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు.. వైసీపీ ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ ఉపయోగిస్తుందని మండిపడ్డారు. బ్లూ ఫ్రాగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు లోకేష్.