నడక నేర్పిన నాన్న గుర్తుగా ఆయన జ్ఞాపకాన్ని ఇలా పదిలం చేసుకున్నాడు..

|

Mar 03, 2022 | 3:59 PM

ఈ ప్రపంచంలో ప్రేమ అమ్మ దగ్గర.. దైర్యం నాన్న దగ్గర మనం నేర్చుకుంటాం.. తడబడ్డా.. తప్పటడుగువేసిన వేలు పట్టుకొని నడిపించే వాడు నాన్న.

నడక నేర్పిన నాన్న గుర్తుగా ఆయన జ్ఞాపకాన్ని ఇలా పదిలం చేసుకున్నాడు..
Ramesh
Follow us on

ఈ ప్రపంచంలో ప్రేమ అమ్మ దగ్గర.. దైర్యం నాన్న దగ్గర మనం నేర్చుకుంటాం.. తడబడ్డా.. తప్పటడుగువేసిన వేలు పట్టుకొని నడిపించే వాడు నాన్న. కష్ఠాలను కడుపులోనే దాచుకొని నవ్వుతూ కనిపించే నాన్న.. మన నుంచి ఏమీ ఆశించారు.. కేవలం మన ఎదుగుదల తప్ప.. అలాంటి నాన్న జ్ఞాపకంగా ఓ వ్యక్తి పదిలంగా దాచుకున్న ఓ వస్తువు ఇప్పుడు అందరి మనసులను దోచుకుంటుంది. తన తండ్రి ఎంతో ఇష్టంగా చూసుకునే స్కూటర్ ను సరికొత్తగా మార్చుకున్నాడు విశాఖపట్టణానికి చెందిన రమేష్ అనే వ్యక్తి.

వస్తువులు.. మనం నిత్యం వాడే వస్తువులు మనకు మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి.. పాడుపడి.. మూలన పడిన వస్తువులతో కూడా మనసు పెడితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక ఈ ప్రపంచంలో తిరిగి రానివి చాలా ఉన్నాయి. వాటిలో మనుషుల ప్రాణాలు కూడా.. మన నుంచి మన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం.. మనలో చాలా మంది చనిపోయిన వారి జ్ఞాపకంగా వారికి సంబంధించిన వస్తువులను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాం.. అదేపని చేశారు రమేష్. తండ్రి స్కూటర్‌ను జ్ఞాపకంగా మార్చుకునేందుకు రమేష్ ఆరేళ్ళు కష్టపడ్డాడు పడ్డాడు. స్కూటర్‌కు కొత్త రూపు తీసుకొచ్చేందుకు నెట్లో గాలించాడు.. ఎవరెవరినో కలిశాడు.. రాష్ట్రాలు వెళ్లి మరీ ఆ స్కూటర్ కు కావాల్సిన పార్ట్ లను తెచ్చుకున్నాడు. కొన్ని తానే సొంతంగా డిజైన్‌ చేసి తయారు చేసుకున్నారు. మొత్తం మీద పాడుబడిన బండిని సరికొత్తగా మార్చాడు. తన తండ్రి ఇష్టపడి కొనుక్కున్న లాంబ్రెట్టా మోడల్‌ లాంబీ 150 స్కూటర్‌ కు పూర్తిగా మరమ్మతుల చేసి సూపర్ గా మార్చాడు. రమేష్‌ స్టీల్‌ప్లాంట్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ స్కూటర్‌ ను తయారు చేస్తూ ఉండేవారట.. ఇలా ఆరేళ్ళ పాటు కష్టపడి తన తన తండ్రి జ్ఞాపకాన్ని పదిలం చేసుకున్నారు రమేష్. దాదాపు రూ.4.50 లక్షలు వెచ్చించి స్కూటర్‌ను తయారు చేశాను అని చెప్పుకొచ్చారు రమేష్. ఇప్పుడు తండ్రి స్కూటర్ పై రయ్ రయ్ మంటూ తిరుగుతున్నాడు. చిన్న తనంలో తన తండ్రి అదే స్కూటర్ పై తనను తిప్పిన రోజులను గుర్తు చేసుకుంటూ పొంగిపోతున్నాడు రమేష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vladimir Putin: పుతిన్ స్టైలే వేరప్ప.. నడిచేటప్పుడు తన కుడిచేతిని ఎందుకు కదిలించరో తెలుసా..?