Vizag: విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం.. ప్లాట్‌పామ్‌ రూఫ్ టాప్ ఎక్కి యువకుడి హల్‌చల్‌.. వీడియో

విశాఖపట్నం రైల్వేస్టేషన్లో కలకలం రేగింది. ప్లాట్‌పామ్‌ రూఫ్ టాప్ ఎక్కి ఒక యువకుడు హల్‌చల్‌ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్‌ , ఆర్పీ పోలీసులు అతనిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. అయతే తనను పట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు సదరు యువకుడు. అప్పటికే రైల్వే ట్రాక్‌పై పూరీ- తిరుపతి రైలు...

Vizag: విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం.. ప్లాట్‌పామ్‌ రూఫ్ టాప్ ఎక్కి యువకుడి హల్‌చల్‌.. వీడియో
Visakhapatnam Railway Station

Edited By: Basha Shek

Updated on: Jan 17, 2024 | 6:15 AM

విశాఖపట్నం రైల్వేస్టేషన్లో కలకలం రేగింది. ప్లాట్‌పామ్‌ రూఫ్ టాప్ ఎక్కి ఒక యువకుడు హల్‌చల్‌ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్‌ , ఆర్పీ పోలీసులు అతనిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. అయతే తనను పట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు సదరు యువకుడు. అప్పటికే రైల్వే ట్రాక్‌పై పూరీ- తిరుపతి రైలు నిలిచి ఉంది. దీంతో రైల్వే పోలీసులు కంగారు పడ్డారు. మొదట విద్యుత్‌ సరఫరాను నిలిపేసిన పోలీసులు యువకుడిని కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే దగ్గరకు వెళ్లేలోపే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పూరీ – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలుపైకి దూకాడు. అతని వెంటే పరుగులు పెట్టిన పోలీసులు ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు.

అయితే సదరు యువకుడికి మతి స్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. అందుకే ఇలా అసాధారణంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. రైల్వే పోలీసులు చాక చక్యంగా వ్యవహరించి యువకుడిని రెస్క్యూ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు.  ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు  వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వైజాగ్ రైల్వే స్టేషన్ లో యువకుడి హల్ చల్.. వీడియో

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి