వరద ప్రవాహంలో చిక్కుకున్న జింకలు…

|

Aug 20, 2020 | 5:54 PM

కడెం ప్రాజెక్ట్‌ కెనాల్‌లో ప్రమాదవశాత్తు రెండు చుక్కల జింకలు పడిపోగా... అప్రమత్తమైన స్థానిక యువకులు... ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండు దుప్పులను సురక్షితంగా రక్షించారు.

వరద ప్రవాహంలో చిక్కుకున్న జింకలు...
Follow us on

భారీగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. భారీగా వస్తున్న వరదకు వంతెనలు తెగిపోతున్నాయి. అడవిలోని జింకలు, దుప్పులు చెట్టుకోకటి .. పుట్టకొకటి మారిపోతున్నాయి. వరద ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాయి. ఇలా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రధాన కాలువలో చిక్కుకున్న జింకలను స్థానిక యువకులు రక్షించారు.

కడెం ప్రాజెక్ట్‌ కెనాల్‌లో ప్రమాదవశాత్తు రెండు చుక్కల జింకలు పడిపోగా… అప్రమత్తమైన స్థానిక యువకులు… ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండు దుప్పులను సురక్షితంగా రక్షించారు. దాదాపు గంటపాటు శ్రమించి తాడుసాయంతో కెనాల్‌ నుంచి బయటకు తీశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని చుక్కల దుప్పులను చికిత్స నిమిత్తం కడెం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.

ఇక నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నందిపేట్ మండలం నడి కూడా గాడేపల్లి గ్రామాల్లో వరద నీటిలో జింకలు చిక్కుకున్నాయి. నది మధ్యలో 5 జింకలను స్థానిక మత్స్యకారులు కాపాడారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటీవల జింకలు సందడి చేశాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో వరద పెరగడంతో నది పరివాహక ప్రాంతం మునిగింది. దీంతో జింకలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించారు స్థానికులు