
రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి. వర్సిటీ పరిసరాల్లో సంచారించిన చిరుత నారం ఫామ్‌హౌస్‌లోని ఓ ఇంటిలోకి వచ్చింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. చిరుత కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్న దృశ్యాలు కెమెరాల్లో నమోదు అయ్యాయి. చిరుత సంచారంతో ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
మే 14న కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై డివైడర్ దగ్గర హల్చల్ చేసింది. తర్వాత స్థానికుల్ని చూసి భయంతో రోడ్డుపై పరుగులు తీస్తూ వెళ్లి ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసింది. అక్కడి నుంచి మెల్లిగా జారుకుని సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌వైపు వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో అది అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని అధికారులు భావించారు.