జవాన్ మృతదేహం పంపేందుకు ‘నో’ చెప్పిన అధికారులు

సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల ప్రాణాలు కోల్పోయిన జవాన్ షకీర్ హుస్సేన్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అధికారులు నో చెప్పారు

జవాన్ మృతదేహం పంపేందుకు నో చెప్పిన అధికారులు

Edited By:

Updated on: Oct 19, 2020 | 1:40 PM

Jawan Shakeer Hussain: సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల ప్రాణాలు కోల్పోయిన జవాన్ షకీర్ హుస్సేన్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అధికారులు నో చెప్పారు. ఆయన భౌతిక కాయానికి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని, అందుకే స్వగ్రామానికి పంపలేమని తెలిపారు. శ్రీనగర్‌లోనే సైనిక లాంఛనాలతో హుస్సేన్ అంత్యక్రియలు జరపబోతున్నట్లు వివరించారు. కాగా అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ జిల్లాకు చెందిన షకీర్ 19 ఏళ్లుగా లఢఖ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న అక్కడి కొండ చరియలు విరిగిపడటంతో షకీర్ మృతి చెందారు. ఇక హుస్సేన్ మృతదేహాన్ని చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు శ్రీనగర్‌కి వెళ్లనున్నారు.

Read More:

‘మహా సముద్రం’లో చేరిన అను ఇమ్మాన్యుల్‌

వైభవంగా జరిగిన సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ఎంగేజ్‌మెంట్‌