తనదైన శైలిలో దూసుకెళ్తోన్న గవర్నర్‌ తమిళిసై…

| Edited By:

Dec 16, 2019 | 5:30 AM

తెలంగాణ గవర్నర్ తమిళిసై తనదైన శైలిలో దూసుకెళ్తోన్నారు. ఇటీవల మూడురోజుల పాటు.. రాష్ట్రంలోని పలుజిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆమె స్పెషాలిటీని అధికారులకు తనదైన శైలిలో తెలియజేసింది. సాధారణంగా ఏ గవర్నర్ పర్యటన చేసినా.. ఆ తర్వాత దానిగురించి ఎక్కువగా పట్టించుకోరు. కానీ తమిళిసై మాత్రం అందుకు భిన్నంగా తన బాధ్యతలు చేపడుతున్నారు. పర్యటనల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కూడా పర్యటించారు. అయితే ఆ జిల్లా పర్యటనలో గవర్నర్‌ తమిళిసై వెంట కలెక్టర్ […]

తనదైన శైలిలో దూసుకెళ్తోన్న గవర్నర్‌  తమిళిసై...
Follow us on

తెలంగాణ గవర్నర్ తమిళిసై తనదైన శైలిలో దూసుకెళ్తోన్నారు. ఇటీవల మూడురోజుల పాటు.. రాష్ట్రంలోని పలుజిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆమె స్పెషాలిటీని అధికారులకు తనదైన శైలిలో తెలియజేసింది. సాధారణంగా ఏ గవర్నర్ పర్యటన చేసినా.. ఆ తర్వాత దానిగురించి ఎక్కువగా పట్టించుకోరు. కానీ తమిళిసై మాత్రం అందుకు భిన్నంగా తన బాధ్యతలు చేపడుతున్నారు. పర్యటనల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కూడా పర్యటించారు. అయితే ఆ జిల్లా పర్యటనలో గవర్నర్‌ తమిళిసై వెంట కలెక్టర్ దేవసేన ప్రతి అంశాన్ని తెలియజేశారు. అంతేకాదు.. అక్కడి ప్రాంత విశిష్టతలను, గ్రామాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ దేవసేనను, అధికారులకు గవర్నర్‌ అభినందన లేఖలు రాశారు.

గవర్నర్ రాసిన ఆ లేఖలో ఏముందంటే.. జిల్లాలో నా టూర్‌ సందర్భంగా మీరు, మీ జిల్లా అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని కలెక్టర్ దేవసేనను కొనియాడారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుందని.. ఈ పర్యటన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇటీవల ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యార్థినుల్లో ఆత్మైస్థెర్యం కోసం చేపడుతున్న కార్యక్రమాలు.. ఎంతో బాగున్నాయన్నారు. పర్యటనలో తనకు సహకరించిన జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రతి ఒక్క ప్రభుత్వాధికారులకు ధన్యవాదాలు తెల్పుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.