JC Travels Case updates:వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాదు సుప్రీం నిషేధించిన వాహనాలను రోడ్లపై ఎలా తిప్పుతారని ఈ సందర్భంగా వారికి చివాట్లు పెట్టింది. ఈ వాహనాలతో ప్రమాదాలు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని వారిని ప్రశ్నించింది. మోసపూరిత పనులను అనుమతించబోమని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
కాగా 154 బస్సులను, లారీలను తప్పుడు డాక్యుమెంట్లతో అమ్మారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో వీరిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. అందులో ఒక దాంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇక బెయిల్‌ని నిరాకరించిన న్యాయస్థానం., దిగువ కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని సూచించింది. అయితే దిగువ కోర్టులు ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లకు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లు కడప జైల్లో ఉన్నారు.
Read This Story Also: సీబీఐకి సుశాంత్ కేసు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీం