Visakhapatnam: హెటెరో డ్రగ్స్‌ పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురి కార్మికులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..

|

Feb 24, 2022 | 6:00 AM

విశాఖపట్నంలోని హెటెరో డ్రగ్స్ లిమిటెడ్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయాపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Visakhapatnam: హెటెరో డ్రగ్స్‌ పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురి కార్మికులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..
Explosion
Follow us on

విశాఖపట్నంలోని హెటెరో డ్రగ్స్ లిమిటెడ్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయాపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నక్కపల్లి మండలంలోని రాజయ్య పేట సమీపంలోని హెటెరో డ్రగ్స్‌ పరిశ్రమ వద్ద డీఎంఎస్‌వో ప్లాంట్‌ లో ఈ పేలుడు సంభవించింది. క్షతగాత్రులను అంబులెన్స్ లో విశాఖ ఆస్పత్రికి తరలించారు. హెల్త్‌సిటీలోని ఓ ఆస్పత్రిలో బాధితులకు చికిత్స అందిస్తు్న్నారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. కాగా ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని నక్కపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నారాయణరావు వెల్లడించారు.

‘బుధవారం రాత్రి పేలుడు సంభవించింది. మొత్తం ఐదుగురికి గాయాలు కాగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం వీరిని విశాఖ పట్నం ఆస్పత్రికి తరలించాం. మిగిలిన ముగ్గురు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు బృందాలను ఫ్యాక్టరీకి పంపాం’ అని సీఐ పేర్కొన్నారు. కాగా పేలుడు అనంతరం కార్మికులు అక్కడి నుంచి భయంతో ఉరుకులు పరుగులు తీశారు. మొత్తం ఆరుగురు గాయపడ్డారంటున్నారు. గాయపడిన వారిని ఎ.సాయిరామ్, గోపాలకృష్ణ దాస్, గంగాధర్ సాహూ, వీర్రాజు, మహేశ్‌, రాజు గా గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మాత్రమే గాయపడ్డారని కంపెనీ చెబుతోంది. వీరిలో సాయిరాం, గంగాధర్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Also Read:Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

Telangana: ఆ కీచకులను చెప్పుతో కొట్టండి.. గుండెలు పిండేస్తున్న యువతి సూసైడ్ లెటర్..

Statue of Equality: సమతాస్ఫూర్తి కేంద్ర సందర్శకులకు అనుమతి.. టైమింగ్స్ ఇవే..