వెలగపూడి గోపాలకృష్ణపై ఏపీ బీజేపీ సస్పెన్షన్ వేటు

ఏపీ బీజేపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ బీజేపీ యూనిట్ నిర్ణయం తీసుకుంది.

వెలగపూడి గోపాలకృష్ణపై ఏపీ బీజేపీ సస్పెన్షన్ వేటు

Edited By:

Updated on: Aug 09, 2020 | 8:32 PM

Suspension against Velagapudi Gopalakrishna: ఏపీ బీజేపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ బీజేపీ యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఓ లేఖను విడుదల చేసింది. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. వెలగపూడి గోపాలకృష్ణ వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని ఆ లేఖలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, డాక్టర్‌ ఓవీ రమణను ఇప్పటికే బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం