సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ పరామర్శ.. సంతోషికి గ్రూప్-1 జాబ్‌తో పాటు…

| Edited By: Pardhasaradhi Peri

Jun 22, 2020 | 4:53 PM

చైనా-భారత్ సరిహద్దు గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా పరామర్శించారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి సూర్యాపేట వెళ్లిన సీఎం కేసీఆర్.. విద్యానగర్‌లోని సంతోష్ బాబు నివాసానికి వెళ్లారు. ముందుగా సంతోష్‌బాబు చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ పరామర్శ.. సంతోషికి గ్రూప్-1 జాబ్‌తో పాటు...
Follow us on

చైనా-భారత్ సరిహద్దు గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా పరామర్శించారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి సూర్యాపేట వెళ్లిన సీఎం కేసీఆర్ విద్యానగర్‌లోని సంతోష్ బాబు నివాసానికి వెళ్లారు. ముందుగా సంతోష్‌బాబు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. వీరయోధుడు సంతోష్ బాబు కుమారుడు, కుమార్తెను పలకరించారు. సంతోష్ భార్య సంతోషి, త‌ల్లితండ్రుల‌తోనూ సీఎం కేసీఆర్ కాసేపు ముచ్చ‌టించారు.

క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషితో మాట్లాడిన కేసీఆర్‌.. ఆమెకు గ్రూప్ వ‌న్‌ జాబ్ అపాయింట్ ఆఫ‌ర్‌ను అంద‌జేశారు. అంతేకాకుండా కుటుంబానికి రూ.5 కోట్ల‌ రూపాయ‌ల చెక్‌ను కూడా అంద‌జేశారు. షేక్‌పేట‌లో 700 గ‌జాల ఇంటి స్థ‌లానికి సంబంధించిన ప‌త్రాల‌ను కూడా సీఎం కేసీఆర్‌.. క‌ల్న‌ల్ సంతోష్ కుటుంబానికి అంద‌జేశారు.

క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు గ్రూప్ వ‌న్ జాబ్ ఇస్తాన‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు సంతోష్ బాబు సతీమణి సంతోషికి గ్రూప్-1 పోస్టు నియామక పత్రం, రూ. 4కోట్ల చెక్కును అందజేశారు. సంతోష్ బాబు తల్లిదండ్రులకు రూ. కోటి చెక్కును సీఎం కేసీఆర్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటనలో సీఎం వెంట విద్యుత్‌శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, రోడ్లు, భ‌వ‌నాలు, గృహ‌నిర్మాణ‌, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల‌శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌, రాష్ట్ర సీఎస్‌ సోమేశ్ కుమార్ ఉన్నారు.