నూతన మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

ఏపీ కేబినెట్‌లో నూతన మంత్రులుగా నియమితులైన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయంలో ఛాంబర్లను కేటాయించారు.

నూతన మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

Updated on: Jul 24, 2020 | 5:39 PM

ఏపీలో నూతన మంత్రులుగా నియమితులైన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయంలో ఛాంబర్లను కేటాయించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఛాంబర్‌ అప్పలరాజుకు, మాజీమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఛాంబర్‌ వేణుగోపాలకృష్ణకు కేటాయిస్తూ.. ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్‌ నారాయణ పాత ఛాంబర్లనే వాడుకోనున్నారు. కాగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారు వారి మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో అప్పలరాజు, వేణు గోపాలకృష్ణలను జగన్‌ ఏపీ కేబినెట్‌లోకి తీసుకున్న విషయం  తెలిసిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us