Andhra Pradesh: పోలీసులను చూసి కారులో పరుగో.. పరుగు.. చివరకు ఏం జరిగిందంటే..

| Edited By: Ravi Kiran

Oct 11, 2024 | 6:21 PM

తెలుగు రాష్ట్రాలు మత్తు రహితంగా మారాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం... క్షేత్ర స్థాయిలో అధికారులు కూడా గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం అహర్నిషలు కృషిచేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్లు, గంజాయ్ బ్యాచ్ కు దిమ్మతిరిగేలా చెక్ పెడుతున్నారు.

Andhra Pradesh: పోలీసులను చూసి కారులో పరుగో.. పరుగు.. చివరకు ఏం జరిగిందంటే..
Ganja Case
Follow us on

తెలుగు రాష్ట్రాలు మత్తు రహితంగా మారాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం… క్షేత్ర స్థాయిలో అధికారులు కూడా గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం అహర్నిషలు కృషిచేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్లు, గంజాయ్ బ్యాచ్ కు దిమ్మతిరిగేలా చెక్ పెడుతున్నారు. అయితే.. కొందరు అక్రమార్కులు, స్మగ్లర్లు.. అడ్డదారుల్లో గంజాయ్, డ్రగ్స్ తరలిస్తుండటం కలకలం రేపుతోంది.. తాజాగా.. అల్లూరి జిల్లా పాడేరులో గంజాయి రవాణా చేస్తున్న వాహనం బీభత్సం సృష్టించింది. కారులో గంజాయ్ తరలిస్తుండగా.. పోలీసులను చూసి తప్పించుకునేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో కారుతో బీభత్సం సృష్టించారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో XUV కారు రేకుల ఇంట్లోకి దూసుకుపోయింది.. ఈ ఘటన పాడేరు చింతల వీధిలో చోటుచేసుకుంది.

పాడేరులో గంజాయి రవాణా చేస్తూ నిందితులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.. అనంతరం స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండ వాహనం వదిలి పరారయ్యారు. రెండు వాహనాల్లో గంజాయి స్మగ్లర్లు వచ్చినట్లు పోలీసుల గుర్తించారు.

వీడియో చూడండి..

అనంతరం.. ట్రాక్టర్ సాయంతో కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనంలో వెయ్యి కిలోల వరకు గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరకు లోయ వైపు నుంచి వస్తున్న గంజాయి స్మగ్లర్లు.. పోలీసులను చూసి పరారయ్యే క్రమంలో పాడేరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..