వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వైవీ సమక్షంలో.. తోటపై చెప్పుతో దాడి

| Edited By:

Feb 20, 2020 | 8:39 AM

తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. వైవీ సమక్షంలో.. తోటపై చెప్పుతో దాడి
Follow us on

తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై ఇజ్రాయెల్ అనే వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, కార్యకర్తలు అతడిని అక్కడి నుంచి పక్కకు తోసేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు అక్కడే ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ తోటను సముదాయించారు.

అయితే ఆ తరువాత తోటపై ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తోటను తానే చెప్పుతో కొట్టానని.. అతడికి వ్యతిరేకంగా పోరాటానికి దళిత సంఘాల మద్దతు కోరుతున్నానని ఇజ్రాయెల్ పేర్కొన్నాడు.

కాగా ఇజ్రాయెల్ గంగవరం మండలం మసకపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడు స్థానిక ఎమ్మెల్యే వేణు వర్గానికి చెందిన వాడని తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం ద్రాక్షారామం భీమేశ్వరాలయానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైవీ సుబ్బారెడ్డితో పాటు తోట త్రిమూర్తులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు సభను ఏర్పాటు చేయగా.. దానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

Read This Story Also:సీఎం పర్యటనలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి చేదు అనుభవం..!