Andhra Pradesh: బైక్ నంబర్ ప్లేటుపై సీఎం జగన్ బొమ్మ.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారంటే..?

|

Jul 29, 2022 | 5:11 PM

ఆ వాహనదారుడు అభిమానంతో బైక్ నంబర్ ప్లేటుపై సీఎం జగన్ ఫోటో ముద్రించాడు. ఈ క్రమంలోనే ఇటీవల తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులకు అతడు కంటపడ్డాడు. ఆ తర్వాత...

Andhra Pradesh: బైక్ నంబర్ ప్లేటుపై సీఎం జగన్ బొమ్మ.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారంటే..?
Cm Jagan Photo
Follow us on

Vizag: చాలామంది  తమ వాహనాలపై అభిమాన హీరోలు లేదా పొలిటికల్ లీడర్స్ పేర్లు, ఫోటోలు వేయిస్తూ ఉంటారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) కనిపించే వెరీ కామన్ సీన్. అయితే బైక్ ధూమ్ పైన ఇంక వేరే చోట వేయిస్తే ప్రాబ్లం లేదు. కానీ నంబర్ ప్లేటుపై.. మిస్ లీడ్ చేసే విధంగా అంకెలు వేయించినా లేదా ఏవైనా ఫోటోలు ముద్రించినా అది ఉల్లంఘన కిందకు వస్తుంది. అయితే తాజాగా వైజాగ్‌లో ట్రాఫిక్ పోలీసులు(Vizag Traffic Police) చెకింగ్స్ నిర్వహించిన క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఓ వాహనదారుడి నంబర్ ప్లేటుపై.. బైక్ నంబర్‌తో పాటు సీఎం జగన్(Cm jagan) ఫోటో కూడా ఉంది. దీంతో ఏం చేయాలి అన్నదానిపై ట్రాపిక్ పోలీసులు కాసేపు ఆలోచించారు. ఆపై తమ రూల్స్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దం అంటూ.. ఆ ప్లేట్ తీసేశారు. సదరు వాహన యజమాని రిక్వెస్ట్ చేసినా కూడా లైట్ తీసుకున్నారు. నా అభిమాన నాయకుడి ఫోటో తీసేస్తారా అని అతడు గట్టిగా అరిచినా పట్టించుకోలేదు. మా డ్యూటీ మేం చేస్తున్నాం అని సమాధానం ఇచ్చారు. రూల్స్‌ క్రాస్ చేసి.. నంబర్ ప్లేట్లపై ఇలాంటివి ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు వైజాగ్ ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడే కాదు గతంలో సైతం.. ఇలాగే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి..  నిబంధనలకు విరుద్దంగా ఉన్న నంబర్ ప్లేట్స్ రిమూవ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..