Vizag: పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇస్తుండగానే.. బయటకు వెళ్లి వివాహిత ఆత్మహత్య.. కారణం ఏంటంటే..?

|

Oct 20, 2022 | 6:17 PM

భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. కేసులు పెట్టుకున్నారు. పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో భార్య ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ బయటకు వెళ్లి ఊహించని పని చేసింది.

Vizag: పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇస్తుండగానే.. బయటకు వెళ్లి వివాహిత ఆత్మహత్య.. కారణం ఏంటంటే..?
Deceased Sirisha (File Photo)
Follow us on

అతనికి ఆల్రేడీ మ్యారేజైంది. ప్రేమిస్తున్నానంటూ మరో యువతి వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. సంసారం సాఫీగా కొన్నినెలలు కూడా సాగలేదు. డబ్బులు, నగలు తీసుకురావాలని భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయ్‌. అవేం లేవని చెప్పడంతో విడాకుల నోటీసు పంపాడు. అతని నైజం అంతా తెలిసిన..ఆ మహిళ తన భర్తే కావాలని కోరుకుంది. ఐతే అందుకు భర్త ఒప్పుకోకపోవడంతో పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఆత్మహత్య చేసుకుంది. విశాఖ MVP పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

విశాఖ శ్రావణి ఆత్మహత్య కేసులో భర్త వేధింపులే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వినయ్‌కుమార్‌కు ఇంతకుముందే వివాహమైంది. ఈ విషయం దాచిపెట్టి శ్రావణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత శ్రావణికి ఈ విషయం తెలిసినా..పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అలుసుగా భావించిన వినయ్‌, తనకు నగలు, డబ్బులు కావాలని వేధింపులకు గురిచేశాడు. శ్రావణి అవేం తీసుకురాకపోవడంతో విడాకుల నోటీసులు పంపారు. మరో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దాంతో మనస్తాపం చెందిన శ్రావణి భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరూ దంపతులను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. శ్రావణి తన భర్తతోనే కలిసి ఉంటానని చెప్పింది. అందుకు వినయ్‌కుమార్‌ ఒప్పుకోలేదు. తనకు విడాకులు కావాలని కోరాడు. దాంతో మనస్థాపం చెందిన శ్రావణి, బయటకు వచ్చి తనతో తీసుకొచ్చిన పెట్రోల్‌ తలపై పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.

ఆమెను కాపాడాలని చూసిన ఎస్సై శ్రీనివాస్‌కి గాయాలయ్యాయి. భర్త వేధింపులే శ్రావణి మృతికి కారణమని చెప్పారు. భర్తే కావాలని, అతనితోనే జీవించాలని శ్రావణి ఆశపడింది. కానీ..శాడిస్ట్‌ భర్త వినయ్‌కుమార్‌..తనకు విడాకులు కావాలని పోలీసుల ఎదుటే కోరడంతో ఆమె తట్టుకోలేక..ఈ దారుణానికి ఒడిగట్టిందని ఏసీపీ మూర్తి చెప్పారు. మొత్తంమీద విశాఖ శ్రావణి ఎపిసోడ్‌లో నిందితుడు భర్త వినయ్‌కుమారేనని పోలీసులు తేల్చారు. అతనిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుంటామని తెలిపారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..