కరోనాతో మృతి చెందాడంటూ.. ఎన్నారై నుంచి 85వేలు వసూలు

| Edited By:

Aug 24, 2020 | 11:17 AM

కరోనా నేపథ్యంలో సేవ చేసేందుకు ఎంతోమంది ముందుకు వస్తుంటే.. కొందరు మాత్రం ఈ వైరస్ పేరుతో వ్యాపారం చేసుకుంటున్నారు

కరోనాతో మృతి చెందాడంటూ.. ఎన్నారై నుంచి 85వేలు వసూలు
Follow us on

Ambulance staff kurnool: కరోనా నేపథ్యంలో సేవ చేసేందుకు ఎంతోమంది ముందుకు వస్తుంటే.. కొందరు మాత్రం ఈ వైరస్ పేరుతో వ్యాపారం చేసుకుంటున్నారు. తాజాగా ఒక సంఘటన ఏపీలోని కర్నూల్‌ జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి సాధారణంగానే మృతి చెందినప్పటికీ, కరోనా సోకి మృతి చెందాడంటూ అంబులెన్స్ సిబ్బంది అతడి కుటుంబ సభ్యులకు తెలిపింది.  ఈ క్రమంలో అంత్యక్రియల కోసం ఎన్నారై నుంచి 85వేలు ఫోన్ పే ద్వారా వసూలు చేసింది. ఈ విషయం కాస్త కలెక్టర్ వీరపాండియన్ దగ్గరకు చేరడంతో ఆయన సీరియస్ అయ్యారు. అంబులెన్స్ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో అంబులెన్స్ నిర్వాహకుడు జయరాజ్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read More:

హిందూ అక్కాచెల్లెళ్లను దత్తత తీసుకొని.. ముస్లిం భయ్యా నీకు హాట్సాఫ్

V movie: ‘వి’కి సెన్సార్ పూర్తి!