YSRCP ఎమ్మెల్యే‌పై స్థానిక నేతల తిరుగుబావుటా.. వేడెక్కిన విశాఖ రాజకీయం

విశాఖ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేపై స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు తిరుగుబావుటా ఎగురవేశారు.

YSRCP ఎమ్మెల్యే‌పై స్థానిక నేతల తిరుగుబావుటా.. వేడెక్కిన విశాఖ రాజకీయం
Golla Babu Rao

Updated on: Dec 29, 2021 | 11:41 AM

విశాఖ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై.. అధికార పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తిరుగుబావుటా ఎగురవేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీకి చెందిన  నియోజకవర్గ ముఖ్యనేతలంతా సమావేశమై.. బాబూరావు ముఖం చూడబోమంటూ ప్రతిఙ్ఞ చేశారు. అసంతృప్తి జ్వాలకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  ఎమ్మెల్యే బాబూరావు వ్యవహార తీరుపై పలువురు సర్పంచ్‌లు, ఎంపీపీ, జెడ్పీటీసీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కష్టకాలంలో తాము ఎమ్మెల్యే బాబూరావు వెంట ఉన్నాం.. ఆదుకున్నాం.. అండగా ఉన్నాం.. కోట్ల రూపాయల అప్పులు తీర్చాం. ఇంత చేస్తే తమను పురుగులా చూస్తున్నారన్నది ఎంపీపీ, జెడ్పీటీసీల ఆవేదన వ్యక్తంచేశారు. అసమ్మతి నేతలందరూ  ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే బాబూరావు వ్యవహార తీరుపై తమ ఆవేదనంతా వెళ్లగక్కారు.

ఈ సమావేశంలో కొందరు కంటతడి పెడితే ఇంకొందరు ఎమ్మెల్యేకి శాపనార్ధాలు పెట్టారు. ఎమ్మెల్యే కులాల వారీగా విభజించి పాలించడమేంటని నిలదీశారు. డబ్బు, కులానికే ఎమ్మెల్యే బాబూ రావు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.  ఎమ్మెల్యే బాబూ రావు తమకు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.  పదేళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని ఆక్రోశం వెళ్లగక్కారు. ఒకరిద్దరు కాదు అధికార పార్టీకి చెందిన చాలామంది నేతలు బాబూరావుపై అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read..

TS RTC: మహిళా కండక్టర్ల కోసం టీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం.. తక్షణం అమల్లోకి ఉత్తర్వులు..

Roja Selvamani: నాని సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా కొట్టు పెట్టుకోవడమే బెటర్.. ఎమ్మెల్యే రోజా ఫైర్..