టిక్‌టాక్ ఎఫెక్ట్.. ఆరేళ్ల తర్వాత తల్లిదండ్రులను కలిసిన యువకుడు

| Edited By:

Feb 23, 2020 | 4:49 PM

ఈ టిక్‌టాక్‌ వల్ల ఓ విచిత్రం జరిగింది. ఎప్పుడో ఆరేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు.. తమ తల్లిదండ్రులను కలిశాడు. ప్రస్తుతం ఈ న్యూస్..

టిక్‌టాక్ ఎఫెక్ట్.. ఆరేళ్ల తర్వాత తల్లిదండ్రులను కలిసిన యువకుడు
Follow us on

టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ యాప్ ఉండని ఫోన్ లేదు. ఈ యాప్‌ ద్వారా ఎవరికి వారు సొంతంగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుని.. ఫేమస్ అవుతున్నారు. అయితే ఒకానొక టైంలో ఈ టిక్‌టాక్ వీడియోస్ మితిమీరాయి. టిక్‌టాక్‌పై మోజుతో విచిత్రమైన విన్యాసాలు చేస్తూ యువత తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తమిళనాడు, గోవా ప్రభుత్వాలు టిక్‌టాక్‌ యాప్‌ని నిషేధించాయి కూడా. అయినా కొద్దిపాటి మార్పులతో మళ్లీ వచ్చేసింది. అయితే ఈ టిక్‌టాక్‌ వల్ల ఓ విచిత్రం జరిగింది. ఎప్పుడో ఆరేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు.. తమ తల్లిదండ్రులను కలిశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫుల్లుగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన పద్మ, పెంటయ్యల కుమారుడు కాశీం పుట్టుకతోనే మూగవాడు. కాశీంకి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఇంట్లో తగాదాల కారణంగా పారిపోయాడు. ఎంత వెతికినా అతని ఆచూకి దొరకలేదు. ఈ క్రమంలో అతనిపై ఆశలు వదులుకున్నారు తల్లిదండ్రులు. అయితే ఒకరోజు ఓ వ్యక్తి తమ కుమారిడిని మరో గ్రామంలో చూసినట్టు చెప్పారు. మరోచోట కనిపించాడని మరో వ్యక్తి చెప్పారు. బాలుడి ఆచూకీ కనుక్కోవడానికి టిక్ టాక్ యాప్ సహాయపడింది.

గతంలో కాశీంని చూసిన భువనగిరి జిల్లా యువకుడు వీడియో తీసి టిక్ టాక్‌లో పెట్టాడు. మళ్లీ కాశీం రోడ్లపై కనిపించగా.. టిక్ టాక్ వీడియో చూసిన అక్కాచెళ్లెల్లు అతన్ని చేరదీశారు. అనంతరం మరో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆధారంగా.. సికింద్రాబాద్ వెళ్లి తమ కుమారిడిని గ్రామానికి తీసుకెళ్లారు.