Andhra Pradesh: నాలుగు రోజుల క్రితం ఆర్కే బీచ్‌లో మిస్సైన సాయిప్రియ.. తన ప్రియుడు రవితో కలిసి విశాఖలో ప్రత్యక్షమైంది. ఇద్దరూ కలిసి ఎయిర్‌పోర్ట్ పీఎస్‌లో కనిపించారు. తమ ప్రాణాలకు ముప్పుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వీరిద్దరి రాకతో.. సాయిప్రియ భర్త శ్రీనివాస్‌ను పీఎస్‌కు పిలవాలని నిర్ణయించారు పోలీసులు. మరోవైపు విడాకులు తీసుకోకుండానే ప్రియుడు రవిని సాయిప్రియ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంతో లీగల్ ఇష్యూగా మారింది.
ఇదిలాఉంటే.. విశాఖకు వచ్చాక సాయిప్రియ కీలక కామెంట్స్ చేసింది. శ్రీనివాస్‌తో తనకు పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పినట్లు వెల్లడించింది. చిన్నప్పటి నుంచి రవి, తాను ఒకరినొకరు ఇష్టపడ్డామని తెలిపింది. అటు సాయిప్రియ లవర్ రవి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్ చేశాడు. తమను బ్రతకనివ్వండంటూ వేడుకున్నాడు. తాను చదువుకున్నానని, ఉద్యోగం చేసి పోషిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇద్దరం కలిసే ఉంటామని.. స్వతంత్రంగా బతుకుతామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై ఇరు పక్షాల కుటుంబ సభ్యులతో పాటు.. సాయిప్రియ భర్త శ్రీనివాస్‌ను పీఎస్ కి పిలిచి మాట్లాడనున్నారు పోలీసులు.
ఇకపొతే.. తమ వివాహ వార్షికోత్సవం రోజునే భర్తకు షాకిచ్చి సాయిప్రియ పారిపోయిన విషయం తెలిసిందే. ఉన్నట్లుండి తన భార్య కనిపించకపోవడంతో శ్రీనివాస్ ఆందోళనకు గురయ్యాడు. సముద్రంలో కోట్టుకుపోయిందనుకుని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారుల, కోస్ట్ గార్డ్ సిబ్బంది అంతా కలిసి సాయి ప్రియ కోసం సముద్ర తీర ప్రాంతమంతా గాలించారు. ఆమె ఆచూకీ కోసం ప్రభుత్వం ఏకంగా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఇంతలోనే.. సాయిప్రియ తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు సమాచారం రావడంతో అంతా ఖంగుతిన్నారు. డే 1 నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న సాయిప్రియు వ్యవహారం.. ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..