Watch Video: ‘చంద్రబాబును కొత్తగా పొగుడ్తున్నా అనుకోవద్దు’.. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి

|

Jun 10, 2024 | 12:30 PM

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం తమది కాదన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం చాల బలమైనదని చెప్పారు. ప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వదించారు.

Watch Video: చంద్రబాబును కొత్తగా పొగుడ్తున్నా అనుకోవద్దు.. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి
Swarupananda Swami
Follow us on

విశాఖపట్నం, జూన్ 10: రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం తమది కాదన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం చాల బలమైనదని చెప్పారు. ప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వదించారు. కేంద్రంతో ఉండే సన్నిహిత, సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నానన్నారు. అమరావతిలో కూడా శారదా పీఠం నిర్మిస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. త్వరలోనే చాతుర్మాస పూజలకోసం రుషికేశ్ వెళ్తున్నా, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నానన్నారు.

చాతుర్మాస దీక్ష అనంతరం హైదరాబాద్‎లోని శారదా పీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు అత్యంత ఆత్మీయుడు అయిన ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్‎లో మంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. అమ్మ వారి కృప చేత మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించిందని చెప్పారు. చంద్రబాబును కొత్తగా పొగుడుతూ ఉన్నానని అనుకోవద్దన్నారు. గతంలో ఆయన గెలవాలని మురళీమోహన్‎తో సమావేశం జరిపినట్లు తెలిపారు. అందులో భాగంగా సాధువులందరితో కలిసి పూజలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. ఎవరికీ భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టడం లేదన్నారు. తనపై, శారదాపీఠంపై తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండాలని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవం అన్నారు. ఆయన చాలా సీనియర్ నేతని.. మరికొన్ని కాలాలపాటు ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకున్నారు. ఈసారైనా దేవాలయాల పాలన బాగుండేలా చూడాలని స్వరూపానంద విజ్ఙప్తి చేశారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..