AP: రాత్రి వేళ కాపుకాసిన పోలీస్.. బండి ఆపి మరీ ఆన్‌లైన్‌లో డబ్బులు కాజేశాడు.. తీరా సీన్ కట్ చేస్తే..

|

Jul 19, 2022 | 8:59 PM

కరాస వద్ద మఫ్టిలో కాపు కాశాడు ఓ పోలీస్.. దాడి చేసి చేతులు తడపితేనే వదిలేది అన్నాడు. తన పాకెట్లో డబ్బులు లేవని చెప్పినా వినకుండా ఫోన్ పే ద్వారా పదిహేను వేలు లాగేసాడు. భార్య అకౌంట్ కు పంపాడు ఆ పోలీస్.

AP: రాత్రి వేళ కాపుకాసిన పోలీస్.. బండి ఆపి మరీ ఆన్‌లైన్‌లో డబ్బులు కాజేశాడు.. తీరా సీన్ కట్ చేస్తే..
Fake Police
Follow us on

జగదాంబ జంక్షన్ లో ఓ వ్యక్తి షాపింగ్ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. కరాస వద్ద మఫ్టిలో కాపు కాశాడు ఓ పోలీస్.. అతనిని అపాడు. ‘ గంజాయి సేవించి ఉన్నావు.. నీపై కేసు పెట్టి జైలుకు పంపి .. బైక్ సీజ్ చేస్తా అన్నాడు. అదేమని ప్రశ్నిస్తే… దాడి చేసి చేతులు తడపితేనే వదిలేది అన్నాడు. తన పాకెట్లో డబ్బులు లేవని చెప్పినా వినకుండా ఫోన్ పే ద్వారా పదిహేను వేలు లాగేసాడు. భార్య అకౌంట్ కు పంపాడు ఆ పోలీస్. జేబులో ఉన్న మరో అయిదు వందల రూపాయలను లాక్కుని విడిచి పెట్టాడు. ఆ బాదితుడికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు వాడు పోలీసునని చెప్పుకుని దోచుకున్న నకిలీ పోలీస్ గా గుర్తించి కటాకటాలా వెనక్కు నెట్టారు అసలు పోలీసులు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న వాడే దారిదోపిడికి పాల్పడిన నకిలీ పోలీస్. పేరు పెట్లి గోపి. గోపాల పట్నం ప్రాంతానికి చెందిన గోపి.. దారి దోపిడీ చెయ్యాలని ప్లాన్ చేశాడు. పోలీస్ అవతారమెత్తి కరాస ప్రాంతంలో కాపుకాసాడు. ఇంటలో వడ్లపూడి ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్… జగదాంబ లో షాపింగ్ చేసుకుని ఇంటికి బైక్ పై తిరుగు ప్రయాణమవుతున్నాడు. అప్పటికే కాపుకాసిన నకిలీ పోలీస్ గోపి.. సంతోష్ ను ఆపాడు. తాను పోలీస్ నని చెప్పుకుని.. గంజాయి ఎందుకు సేవించ్చావని ప్రశ్నించ్చాడు. తాను అలా చేయలేదని బదులివ్వడంతో.. దాడి చేశాడు గోపి. మరింత ఆగ్రహంతో ఉగిపోయి.. ఎక్కువ మాట్లాడితే కేసులో ఇరికించి జైలుకు పంపుతానానాడు. ఏం జరుగుతుందొ అర్ధం కాని సంతోష్ షాక్ లోకి వెళ్ళాడు. అంతలో జేబులో ఉన్న నగదు బయటకు తీయాలని సూచించ్చాడు ఆ నకిలీ పోలీస్. తనదగ్గర అయిదు వండలే ఉన్నాయని చెప్పడంతో… ఫోన్ పే ద్వారా బాదితుడి నుంచి పదిహేను వేలు లాగేసాడు. ఆన్ లైన్ లో తన భార్య అకౌంట్ కు పంపుకున్నాడు గోపి. అంతటితో ఆగకుండా సంతోష్ దగ్గరున్న మరో అయిదు వందలను లాక్కున్నాడు. ఆ తరువాత అక్కడ నుంచి జారుకున్నాడు ఆ నకిలీ పోలీస్. అప్పటి వరకు షాక్ లో ఉన్న బాదితుడు.. కాస్త కోలుకున్నాక వాడిపై అనుమానం వఛ్చింది. దింతో… ఎయిర్ పోర్ట్ పోలీసులను ఆశ్రాయించిన బాదితుడు.. జరిగినదంతా వివరించ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులు.. చాలెంజింగ్ గా తీసుకున్నారు. పోలీసుల పేరుతో దోచుకుని ఖాకీలకే మచ్చ తెచ్ఛే విధంగా దోపిడీ చేసిన నిందితుడిని 24గంటల్లోనే ట్రాక్ చేశారు. గోపిని పట్టుకుని కట కటాల వెనక్కు నెట్టారు. 15వేల 5వందల నగదును స్వాదీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడి భార్య మొబైల్, నకిలీ పోలీస్ వినియోగించిన బైక్ ను సీజ్ చేశారు.

ఇదీ విశాఖలో నకిలీ పోలీస్ రాబరీ క్రైం

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఖాజా, వైజాగ్