యువతపై సోషల్ మీడియా చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది. ట్రెండ్ సెట్ చేసేందుకు ప్రయత్నించి ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అప్‌లోడ్ చేస్తూ వైరల్ అయ్యేందుకు తాపత్రాయ పడుతున్నారు. అయితే.. ఏం జరగనంత వరకూ బాగానే ఉంటుంది. కానీ.. కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటుండటం ఇబ్బందిగా మారుతోంది. విజయవాడలో ఓ యువతి చేసిన రీల్స్ ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టాయి. విజయవాడ కనకదుర్గ వారధిపై నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేస్తూ ఇన్‌స్టా రీల్స్ చేసింది తనూజ అనే యువతి. అంతేకాదు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఆమె వీడియోకి లైక్స్, షేర్‌లు కూడా దండిగానే వచ్చాయి.
అంతవరకూ ఓకే.. కానీ.. తనూజ చేసిన ఇన్ స్టా రీల్స్‌పై ఓ నెటిజన్ ట్విట్టర్లో స్పందిస్తూ విజయవాడ పోలీసులను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. బ్యాడ్ డ్రైవర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీడియోపై కంప్లెంట్ చేస్తూ విజయవాడ పోలీసులను ప్రశ్నించారు. ఇంకేముంది.. ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇన్‌స్టాలో రీల్స్ చేసిన ఆ యువతికి షాక్ ఇచ్చారు. ఇన్‌స్టా రీల్స్ చేసిన తనూజ వెహికిల్‌కుఫైన్ విధించినట్లు ట్విట్టర్‌లో తెలిపారు విజయవాడ పోలీసులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆ యువతికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.
మొత్తంగా.. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేయడం, సోషల్ మీడియా పిచ్చితో ఇబ్బందుల్లో పడటం యువతకు కామన్ అయిపోయింది. ఇప్పటికైనా.. కొన్ని కొన్ని స్టంట్స్ విషయాల్లో యువతీ యువకులు జాగ్రత్తగా ఉండటం బెటర్ అంటున్నారు విజయవాడ తనూజ ఎపిసోడ్ చూసిన ప్రజలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..