Andhra Pradesh: సాధారణ తనిఖీలు.. లైసెన్స్ లేకుండా దొరికిన వ్యక్తులు.. బ్యాగులు చెక్ చేయగా..

క్రియేటివ్ ఐడియాస్‌ను అమలు చేస్తూ.. అంతుచిక్కని మార్గాల్లో రహస్యంగా మత్తు పదార్ధాలను అక్రమ రవాణా సాగిస్తున్నారు.

Andhra Pradesh: సాధారణ తనిఖీలు.. లైసెన్స్ లేకుండా దొరికిన వ్యక్తులు.. బ్యాగులు చెక్ చేయగా..
Representative Image

Updated on: Apr 05, 2023 | 8:17 AM

నేరగాళ్లు తెలివి మీరిపోయారు. తమ దందాను కొనసాగించేందుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. క్రియేటివ్ ఐడియాస్‌ను అమలు చేస్తూ.. అంతుచిక్కని మార్గాల్లో రహస్యంగా మత్తు పదార్ధాలను, బంగారాన్ని అక్రమ రవాణా సాగిస్తున్నారు. తాజాగా గోల్డ్‌ను అక్రమంగా రవాణా చేస్తూ కొందరు వ్యక్తులు ఏపీ పోలీసులకు అడ్డంగా దొరికారు. సుమారు 12.97 కేజీల బంగారాన్ని ఖాకీలు స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల రాష్ట్ర ఇంటిలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో విజయవాడ కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఆంధ్రప్రదేశ్-తమిళనాడు బోర్డర్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణ తనిఖీలు చేపట్టారు. నలుగురు వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరకారు. వారి కదలికలు కొంచెం తేడాగా ఉండటంతో బ్యాగులు చెక్ చేయగా.. 12.97 కేజీల గోల్డ్ లభించింది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం దాని విలువ రూ. 7.48 కోట్లు ఉండొచ్చునని అంచనా. కాగా, తనిఖీల్లో దొరికిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారిపై కేసు నమోదు చేశారు కస్టమ్స్ అధికారులు.

Follow Us