Viral Video: విద్యార్ధులతో కలిసి భోజనం చేసిన కొండముచ్చు.. ఆశ్చర్యానికి గురైన స్థానికులు..

ఓ కొండముచ్చు చేసిన వింత పనులు చూసి అక్కడున్న వారంతా ముందు ఆశ్చర్యపడిన తర్వాత సంతోషపడ్డారు. అక్కడున్న విద్యార్థులతో సరదాగా ఆ కొండముచ్చు ఆటలాడి వారితో కలిసి భోజనం చేసింది. అంతేకాక ఆ కొండముచ్చు అక్కడే ఉన్న ఓ వాహన అద్దంలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయింది. ప్రస్తుతం ఆ కొండముచ్చు చేస్తున్న వింత చేష్టల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: విద్యార్ధులతో కలిసి భోజనం చేసిన కొండముచ్చు.. ఆశ్చర్యానికి గురైన స్థానికులు..
Viral Video

Edited By: Srikar T

Updated on: Jan 24, 2024 | 10:36 AM

ఏలూరు జిల్లా, జనవరి 24: ఓ కొండముచ్చు చేసిన వింత పనులు చూసి అక్కడున్న వారంతా ముందు ఆశ్చర్యపడిన తర్వాత సంతోషపడ్డారు. అక్కడున్న విద్యార్థులతో సరదాగా ఆ కొండముచ్చు ఆటలాడి వారితో కలిసి భోజనం చేసింది. అంతేకాక ఆ కొండముచ్చు అక్కడే ఉన్న ఓ వాహన అద్దంలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయింది. ప్రస్తుతం ఆ కొండముచ్చు చేస్తున్న వింత చేష్టల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగింది. అక్కడే ఉన్న కొందరు ఆ కొండముచ్చు చేసిన చిలిపి చేష్టలను తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీయడంతో అవి ఇప్పుడు వైరల్‎గా మారాయి. మధ్యాహ్నం సమయంలో జంగారెడ్డిగూడెం హైస్కూల్ దగ్గరకు ఓ కొండముచ్చు వచ్చింది. ఆ సమయంలో విద్యార్థులు భోజనం చేస్తున్నారు. అయితే ఆ కొండముచ్చు భోజనం చేస్తున్న విద్యార్థుల దగ్గరకు వెళ్లి కూర్చుంది. ఓ విద్యార్థి తన పళ్లెంలోని ఆహారాన్ని దానికి పెట్టాడు. కాస్త ఆహారం రుచి చూసిన కొండముచ్చు విద్యార్థితో కలిసి తాను కూడా అదే పళ్లెంలో తినడం ప్రారంభించింది.

ఓవైపు కొండముచ్చు మరోవైపు విద్యార్థి ఒకే పళ్లెంలోని ఆహారాన్ని పంచుకుని పోటీపడి మరి తిన్నారు. దాంతో చుట్టుపక్కల ఉన్న విద్యార్థులంతా అక్కడికి చేరుకుని దాని కోతి చేష్టలను చూసి ఆనందించారు. తరువాత కొండముచ్చు ఓ దిమ్మ మీద కూర్చుని విద్యార్థులతో కలిసిపోయింది. విద్యార్థులు కూడా ఏమాత్రం భయపడకుండా దాని శరీరంపై నిమురుతూ దానితో కలిసి ఆటలాడారు. అలా విద్యార్థులకు కొండముచ్చుకు మంచి స్నేహం ఏర్పడింది. కాసేపు విద్యార్థులతో ఆటలాడిన కొండముచ్చు పక్కనే ఉన్న ఓ ఐచర్ వాహనం పైకి ఎక్కి దానికున్న అద్దంలో తన అందాన్ని తనివి తీరా చూసుకుని మురిసిపోయింది. అక్కడున్న విద్యార్థులతో పాటు స్థానికులు కొండముచ్చు చేసిన వింత చేష్టలకు ముందు ఆశ్చర్యం వ్యక్తం చేసిన తర్వాత సరదాగా దాని వింత విన్యాసాలను చూసి ఆనందించారు. ప్రస్తుతం దాని వింత చేష్టలకు సంబంధించిన వీడియోలు వైరల్‎గా మారాయి.

 

ఇవి కూడా చదవండి

మరన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..