Vegetable Prices: షాక్‌ కొడుతున్న కూరగాయల ధరలు.. అక్కడ మాత్రం రూ. 50 కే కిలో టమాట..

|

Jul 04, 2023 | 6:03 AM

మొన్నటి వరకూ ఎండలు భగభగ మండిపోతే.. ఇప్పుడు కూరగాయల ధరలు భగ భగమంటున్నాయి. వాటి జోలికి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు జనాలు. దాంతి పరిస్థితి ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్నట్లుగా ఉంది. అవును, తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.

Vegetable Prices: షాక్‌ కొడుతున్న కూరగాయల ధరలు.. అక్కడ మాత్రం రూ. 50 కే కిలో టమాట..
Vegetable Price
Follow us on

మొన్నటి వరకూ ఎండలు భగభగ మండిపోతే.. ఇప్పుడు కూరగాయల ధరలు భగ భగమంటున్నాయి. వాటి జోలికి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు జనాలు. దాంతి పరిస్థితి ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్నట్లుగా ఉంది. అవును, తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయల ధర చూసినా ఆకాన్నంటుతోంది. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న టమాటాల కోసం మార్కెట్లకు క్యూ కడుతున్నారు జనం.

ఏపీ, తెలంగాణలో కొద్దిరోజులుగా కూరగాయల ధరలు షాకిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు పెరిగిపోయాయి. మొన్నటివరకు రూ. 100 తీసుకెళ్తే నాలుగైదు రకాల కూరగాయలు వచ్చేవి. కానీ.. ఇప్పుడు ఐదొందలు తీసుకెళ్లినా సంచి నిండని పరిస్థితి నెలకొంది. దాంతో.. సామాన్య ప్రజలు కొనలేని పొజిషన్‌ ఏర్పడుతోంది. అధిక రేట్లతో కొన్ని ప్రాంతాల్లోనైతే కొనుగోలుదారులు లేక కూరగాయల మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఇక.. టమాట ధర అయితే ఆల్‌టైమ్‌ హైకి చేరుకుంది. నిన్నమొన్నటి వరకూ రూ. 110, రూ. 120 లుగా ఉన్న టమాట ధర ఇప్పుడు రూ.130 ని క్రాస్‌ చేసింది.

ఈ క్రమంలోనే.. ఏపీ ప్రభుత్వం టమాటాను రైతు బజార్లలో సబ్సిడీపై అందిస్తోంది. పలు రైతు బజార్లలో రాయితీపై రూ. 50 లకే కిలో టమాటా ఇస్తున్నారు. బయట మార్కెట్‌లోకన్నా తక్కువ ధరకు టమాటా లభిస్తుండటంతో ప్రజలు రైతు బజార్లకు క్యూ కడుతున్నారు. దాంతో.. రైతు బజార్లలోని టమాటా కౌంటర్లు కస్టమర్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో సబ్సిడీ టమాటా కోసం ఎగబడ్డారు జనం. రూ. 50 కే టమాటాలు ఇస్తుండటంతో మహిళలు పెద్దయెత్తున తరలివచ్చారు. టమాటాలు తీసుకునే క్రమంలో తోపులాట జరిగింది. నందిగామ రైతు బజార్‌లో 3 కౌంటర్ల ద్వారా సుమారు రెండున్నర టన్నుల టమాటాలు పంపిణీ చేసినట్లు తెలిపారు మార్కెట్ యార్డ్‌ చైర్మన్ మస్తాన్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు సబ్సిడీపై రూ. 50 లకే కేజీ టమాటాలు అందిస్తున్నామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..