Vegetabele Prices: కొనలేం.. తినలేం.. కొండెక్కిన కూరగాయలు.. ఏదీ పట్టుకున్నా రూ. 100 పైమాటే.!

| Edited By: Ravi Kiran

Nov 30, 2023 | 12:04 PM

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా చికెన్ ధర పూర్తిగా పతనం అయింది. నిన్న మొన్నటి వరకు కేజీ చికెన్ 250 నుంచి 300 వరకు ఉండగా, ఇప్పుడు కేజీ కోడి మాంసం ధర 80 రూపాయలకు చేరింది. కార్తీకమాసం కావడంతో ఆ ప్రభావం చికెన్‌పై తీవ్రంగా పడిందని అంటున్నారు వ్యాపారులు.

Vegetabele Prices: కొనలేం.. తినలేం.. కొండెక్కిన కూరగాయలు.. ఏదీ పట్టుకున్నా రూ. 100 పైమాటే.!
Vegetables
Follow us on

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా చికెన్ ధర పూర్తిగా పతనం అయింది. నిన్న మొన్నటి వరకు కేజీ చికెన్ 250 నుంచి 300 వరకు ఉండగా, ఇప్పుడు కేజీ కోడి మాంసం ధర 80 రూపాయలకు చేరింది. కార్తీకమాసం కావడంతో ఆ ప్రభావం చికెన్‌పై తీవ్రంగా పడిందని అంటున్నారు వ్యాపారులు. కార్తీక మాసాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. శివుడికి ప్రీతిపాత్రమైన మాసం కావడంతో భక్తులు అత్యంత నిష్టగా పూజలు చేస్తారు. ఈ మాసాన్ని ఉత్తరాంధ్రలో భక్తులు ఎంతో అమితంగా జరుపుతారు. పెద్ద ఎత్తున శివమాలాధరణలు వేసుకుంటూ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఈ మాసం అంతా భక్తులు మాంసాహారాలు ముట్టుకోకుండా గడుపుతారు. మాంసాహారాలు తింటే మహాపాపంగా భావిస్తారు. అలా వాడకం తగ్గడంతో మాంస విక్రయాలు కూడా పడిపోయాయి. అందులో మాంస ప్రియులు అధికంగా వినియోగించే చికెన్ వాడకం మరింత గణనీయంగా తగ్గింది. వినియోగం తగ్గడంతో చికెన్ ధర కూడా అమాంతం పడిపోయింది.

అకస్మాత్తుగా చికెన్ ధర పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. కరోనా తరువాత ఆరోగ్య సూత్రాల్లో భాగంగా చికెన్ వాడకం భారీగా పెరగగా, సుమారు మూడేళ్ల తరువాత మళ్లీ మొదటిసారి చికెన్ ధర పడిపోవడంతో చికెన్ షాపుల యజమానులతో పాటు పౌల్ట్రీ వ్యాపారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కార్తీక మాసం అంతగా పట్టించుకోని మాంసప్రియులు మాత్రం ఇదే మంచి అదునుగా అధికంగా కొనుగోలు చేసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓ వైపు మాంసం వాడకం తగ్గితే మరో వైపు కూరగాయల వాడకం పెరగింది. దీంతో కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి. పలు రకాల కూరగాయల ధరలు చికెన్ ధరతో పోటీపడుతున్నాయి. ఒకప్పుడు చికెన్ కొనబోతే కొరివిలా ఉంటే ఇప్పుడు అదే పరిస్థితి కూరగాయలకు వచ్చింది.

టమాటా, బీరకాయ, బెండకాయతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వాడకం పెరగడం వల్ల పెరుగుతున్న కూరగాయల ధరలతో పాటు దళారీల మాయాజాలం వినియోగదారులకు ఇబ్బందిగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా.. పెరిగిన కూరగాయల వినియోగం, దళారీల బ్లాక్ మార్కెట్ కారణంగా అదుపులోకి వచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. దీంతో విజిలెన్స్ అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరైనా కూరగాయలను కృత్రిమ ధరలు పెంచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా తగ్గిన చికెన్ ధరలు, పెరిగిన కూరగాయల ధరలు సాధారణ స్థితికి రావడానికి మరికొన్ని పడుతుందని అంటున్నారు వ్యాపారులు.