Kishan Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఏపీకి కీలక సూచనలు..

|

Aug 19, 2021 | 7:37 AM

Kishan Reddy: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Kishan Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఏపీకి కీలక సూచనలు..
Kishan Reddy
Follow us on

Kishan Reddy: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కిషన్ రెడ్డి వెంట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా వెళ్లారు. రంగనాయకుల మండపంలో కిషన్ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని, కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టాలని శ్రీవారిని ప్రార్థించానని చెప్పారు.ఇదే సమయంలో పొలికల్ కామెంట్స్ కూడా చేశారు కిషన్ రెడ్డి. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారని అన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌‌కు పాల్పడేవారిని అంతర్జాతీయ మాఫీగా పేర్కొన్నారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్ ఇతర దేశాల నేరస్తులకు సంబంధించిన విషయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ ఎర్ర మాఫియాను అడ్డుకోవాలంటే.. ఆంధ్రప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు. ఇదిలాఉంటే.. శ్రీ వేంకటేశ్వరుని తల్లి వకులామాతా ఆలయం నిర్మాణానికి టీటీడీ పూనకోవడం సంతోషకరం అని కిషన్ రెడ్డి పేర్కొననారు. కాగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుపతి నుంచి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ఏపీలో రెండు రోజులపాటు తిరుపతి, విజయవాడ పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో ఈ యాత్ర సాగనుంది. ఇక తెలంగాణలో మూడు రోజుల పాటు సాగనుంది. కేంద్రంలో బీజేపీ పాలన ఏడేళ్లు పూర్తైన సందర్భంగా కిషన్ రెడ్డి ఈ జన ఆశీర్వాద యాత్ర చేపట్టారు.

Also read:

ఏపీ: పాఠశాలలకు పండగ సెలవులు ప్రకటన.. అకడమిక్ క్యాలెండర్ విడుదల.. పనిదినాలు ఎన్నంటే.!

Ramayana: హనుమంతుడికి శత్రువులో కూడా శతృత్వాన్ని ఎంతవరకూ చూడాలో సీతాదేవి చెప్పిన నీతి కథ

Vishal: లైకా సంస్థకు భారీగా జరిమానా విధించిన హైకోర్టు.. ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో విశాల్..