వాళ్ళంతా స్నేహితులు. వేర్వేరు చోట్ల చదువుతున్నారు. పొంగల్ హాలిడేస్‌కు అంతా ఒకచోట చేరారు. అరకు టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఆరుగురు ఫ్రెండ్స్ మూడు బైక్‌లపై బయల్దేరారు. అరకులో ఎంజాయ్ చేశారు. సరదాగా గడిపారు. అక్కడి నుంచి వంజంగి మేఘాల కొండకు ఉత్సాహంగా బయల్దేరారు. అంతలోనే.. వివరాల్లోకి వెళ్తే.!
అల్లూరి జిల్లా అరకు లోయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు రోలర్‌ను బైక్ ఢీకొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. డుంబ్రిగుడ మండలం కురిడి సమీపంలో ఘటన జరిగింది. మృతులు ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు మండలం తీనుసామంత వలసకు చెందిన రవితేజ(20), వాసు(20)గా గుర్తించారు. ఇద్దరూ డిగ్రీ విద్యార్థులు. అరకు విహారానికి వెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, మృతుల స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే గ్రామానికి చెందిన ఈ యువకులంతా స్నేహితులు. ఒక్కో చోట చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో గ్రామానికి చేరుకున్నారు. సరదాగా అరకు టూర్ ప్లాన్ చేసుకుని బుధవారం బయల్దేరారు. అరకులో కాసేపు గడిపాక.. అక్కడి నుంచి వంజంగి వెళ్దామనుకున్నారు. అరకు నుంచి పాడేరు వైపు వెళ్తుండగా.. కురిడి సమీపంలో రోడ్డు పనులు చేస్తున్న రోలర్‌ను బైక్ అదుపుతప్పి బైక్ ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న రవితేజ, వాసు తీవ్రంగా గాయపడి స్పాట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. కళ్ల ముందే ఇద్దరు స్నేహితులు విగత జీవులుగా మారడంతో స్నేహితులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..