Sri Sathya Sai District: పండుగ వేళ దారుణం.. అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్‌

వాచ్‌మన్‌ని, అతని కొడుకును కత్తులతో బెదిరించి.. అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో ఘటన చోటు చేసుకుంది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి..

Sri Sathya Sai District: పండుగ వేళ దారుణం.. అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్‌
Andhra Crime News

Updated on: Oct 12, 2024 | 11:48 AM

పండుగ వేళ  శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్‌‌కు పాల్పడ్డారు దుండగులు. వాచ్‌మన్‌ని, అతని కొడుకును కత్తులతో బెదిరించి.. అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేశారు నలుగురు దుండగులు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో ఘటన వెలుగుచూసింది. ఉపాధి కోసం ఇటీవలే బళ్లారి నుంచి వచ్చింది కుటుంబం.. వీళ్లు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు..
ఈ కుటుంబం ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసి వీళ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. జిల్లా ఎస్పీ కూడా వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. బాధితులను ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..