శ్రీకాకుళం జిల్లాలో చిన్నారుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకే రోజు జిల్లాలో వేరు వేరు ఘటనల్లో ఓ బాలిక, ఓ బాలుడు ఆత్మహత్య చేసుకోగా…మరో బాలుడు ఆత్మహత్యకు యత్నించటం ఆందోళన కలిగిస్తోంది. బాల్యం లోనే ఆత్మహత్య అనే ఆలోచనలు చిన్నారుల్లో కలగటం పై ఇప్పుడు అందరిలోనూ ఆందోళనను పెంచుతోంది. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు చూసాం. ప్రేమ విఫలమై ఆత్మహత్యలు చేసుకున్న యువతి,యువకులని చూసాం, కుటుంబ కలహాలు, మనస్పర్థలతో సూసైడ్లు చేసుకున్న దంపతులని,కుటుంబ సభ్యులని చూసాం. కానీ ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు బాల్యంలోకి తొంగి చూస్తున్నాయి. అభం శుభం తెలియని బాల బాలికల జీవితాలను చిదిమేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఒక్క రోజే ఓ బాలిక, ఓ బాలుడు ఆత్మహత్యలు చేసుకోగా మరో బాలుడు ఆత్మహత్య యత్నంకి పాల్పడి ప్రాణాలతో బయటపడటం జిల్లా లో చర్చనీయాంశమవుతోంది.
శ్రీకాకుళం నగరంలోని దత్తాత్రేయ గుడి సమీపాన కొత్త బ్రిడ్జిపై నుండి నాగావళి నదిలోకి ఆదివారం తెల్లవారు జామున దూకి 13 ఏళ్ల చిన్నారి మృతి చెందిoది. నాగావళి నదిలో ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలిక మృతి గురించి ఇంకా సమగ్ర సమాచారం తెలియాల్సి ఉంది. బాలిక బాలిక ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం పోలీసుల దర్యాప్తులో తెలనుంది.మృతురాలుని శ్రీకాకుళం ముత్యవాని పేటకి చెందిన ఢిల్లీశ్వరిగా గుర్తించారు. సరిగా చదవటం లేదని తల్లి మందలించటంతో బాలిక శనివారం రాత్రి ఇంటి నుండి చెప్పకుండా వెళ్లిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. రాత్రంతా వెతికామని….తెల్లవారుజామున ఇలా శవమై కనిపించిందనీ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలిసులు కేసు నమోదు చేసి బాలిక మృతిపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.
మెలియాపుట్టి మండలంలో పెద్దమడి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు యత్నిచటం, అందులో ఒక బాలుడు మృతి చెందటం జిల్లాలో పెద్ద చర్చికి దారితీస్తోంది.మేలియాపుట్టి పెద్దమడి ఆశ్రమ పాఠశాలలో సవర సుశాంత్ రింపి హరి ఇద్దరు విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారు సవర సుశాంత్ ఎవరో అమ్మాయితో క్లోజ్ గా ఉండటం ఉపాధ్యాయుడు చూడటంతో అది అందరికీ చెప్పేస్తారనీ ఆత్మహత్యకి పాల్పడుదామన్న నిర్ణయానికి వచ్చాడు.
అలాగే రింపి హరీప్ అనే బాలుడు అదే హాస్టల్ లో చదువుతున్నాడు. హరీప్ దొంగతనం అభియోగం తో అవమానంగా ఫీలయ్యి ఆత్మ హత్యకు విఫల యత్నం చేసాడు. వీరి ఇరువురు వేరు వేరు కారణాలతో మనస్థాపానికి గురై కళాశాల సమీపంలో ఒక తోటలో చెట్టుకి తువ్వాలు కట్టుకుని ఉరివేసుకోగా సుశాంత్ అక్కడే చనిపోయాడని హరీప్ తను వేసుకున్న టవల్ తెగిపోవడంతో కింద పడిపోయాడు. వెంటనే కొట్టుమిట్టాడుతున్న సుశాంత్ ను చూసి భయపడి అక్కడి నుండి ఊర్లోకి పరుగులు తీశాడు. జరిగిన విషయం తన స్కూల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా చెప్పటంతో వారంతా వెళ్లి చూడగా సుశాంత్ శవమై కనిపించాడు. పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..