విజయవాడలో అతివేగం కారణంగా బైక్ యాక్సిడెంట్‌కు గురై ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పెనుమలూరుకు చెందిన ముగ్గురు యువకులు కొండపల్లి నుండి విజయవాడ వస్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.పెనమలూరుకు చెందిన ముగ్గురు యువకులు ట్రిపుల్ డ్రైవ్ చేస్తూ కొండపల్లి నుండి 120 పల్సర్ బైక్ పై విజయవాడ వస్తున్నారు. భవానిపురం టర్నింగ్ వద్దకు వచ్చిన తర్వాత బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. 120 స్పీడ్ తో రావడం తో బైక్ 50 అడుగుల దూరం దూసుకెళ్లింది. దీంతో బైక్ పై ఉన్న సాధిక్, కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలయిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. యువకుల డీటేల్స్ సేకరించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగంతో ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెపుతున్నారు.
బస్సు రివర్స్ చేస్తుండగా ప్రమాదం..రెండేళ్ల బాలుడు మృతి
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు మండలం వీరవల్లిలో విషాదం జరిగింది. వీరవల్లి సమీపంలో ఉన్న వేడుక హోటల్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రివర్స్ చేస్తుండగా.. ఆ వాహనం కింద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళకు ఉపాధి నిమిత్తం వెళ్తున్న కూలీల బస్సు మార్గమధ్యలో వీరవల్లి వద్ద భోజనం కోసం వేడుక హోటల్ దగ్గర బస్సును డ్రైవర్ ఆపాడు. బస్సు ఆపిన అనంతరం కాలకృత్యాల కోసం బాలుడిని తల్లి కిందకు దించింది. అదే సమయంలో పార్కింగ్ చేయడానికి బస్సు రివర్స్ చేస్తుండగా బాలుడు వెనుక చక్రాల కింద పడి స్పాట్‌లోనే మృతి చెందాడు.
Also Read: Viral Video: 2 గంటలు చిన్నారి మెడను చుట్టిన నాగుపాము… కానీ చివరకు మాత్రం