బిచ్చగత్తె పిల్లలను కిడ్నాప్ చేసిందంటూ తల్లి ఫిర్యాదు.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం!

| Edited By: Ravi Kiran

Nov 10, 2023 | 6:55 PM

కాకినాడ జిల్లా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కొడుకు, కూతురు కనిపించడం లేదని దిశ యాప్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగింది. బాధిత మహిళ నుంచి కాల్ వచ్చిన నాలుగు నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి..

బిచ్చగత్తె పిల్లలను కిడ్నాప్ చేసిందంటూ తల్లి ఫిర్యాదు.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం!
Representative Image
Follow us on

కాకినాడ జిల్లా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కొడుకు, కూతురు కనిపించడం లేదని దిశ యాప్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగింది. బాధిత మహిళ నుంచి కాల్ వచ్చిన నాలుగు నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి దిశ పోలీసులు చేరుకున్నారు. మరియమ్మ ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

13 సంవత్సరాల వయసున్న కొడుకు, 14 సంవత్సరాల వయసున్న కూతురు కనిపించడం లేదని తల్లి మరియమ్మ దిశ పోలీసులకు తెలిపింది. అదే విధంగా కాకినాడలోని రేచిల్లపేటలో ఉండే మహిళా యాచకురాలు తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లినట్టు మరియమ్మ అనుమానం వ్యక్తం చేసింది. బాధిత మహిళ ఇచ్చిన వివరాల ప్రకారం దిశ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మహిళా యాచకురాలు ఉన్న లొకేషన్‌కు ఒక బృందం వెళ్లి పిల్లల కోసం వెతకడం జరిగింది. ఆ ప్రదేశానికి పిల్లలు ఎవరు రాలేదని పోలీసుల విచారణలో తేలింది. అదే విధంగా మరొక బృందం బాధితురాలు ఉంటున్న ప్రదేశంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లల కోసం అన్వేషణ చేపట్టారు. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించారు. వెంటనే దిశ పోలీసులు ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి సురక్షితంగా తల్లికి అప్పగించారు.

కేవలం గంట వ్యవధిలోనే తప్పిపోయిన ఇద్దరు మైనర్ పిల్లలను కనిపెట్టడంతో పాటు, సురక్షితంగా తల్లికి అప్పగించారు దిశ పోలీసులు. ఇంట్లో తల్లి మందలించిందని అలిగి వెళ్లిపోయినట్టు ఇద్దరు పిల్లలు ఖాకీలకు తెలిపారు. ఈ నేపథ్యంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలకు కూడా దిశ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కాగా, మిస్సింగైన గంట వ్యవధిలోనే దిశ పోలీసులు సురక్షితంగా తన ఇద్దరు పిల్లలను అప్పగించారని మరియమ్మ సంతోషం వ్యక్తం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..