ఇదెక్కడి విచిత్రమో! అమలాపురం స్కూల్‌లో స్టూడెంట్స్ అందరూ కవలలే..

|

Feb 28, 2020 | 3:44 PM

ఇంట్లో కవలలు ఉంటే అప్పుడప్పుడు వారిని పోల్చడంలో తల్లిదండ్రులు కన్ఫ్యూషన్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఒకే చోట 20 మంది కవల పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి.? సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ ఒకటి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గరలోని ముమ్మిడివరం బాలాజీ ప్రైవేట్ స్కూల్‌లో చోటు చేసుకుంది...

ఇదెక్కడి విచిత్రమో! అమలాపురం స్కూల్‌లో స్టూడెంట్స్ అందరూ కవలలే..
Follow us on

Twins School: ఇంట్లో కవలలు ఉంటే అప్పుడప్పుడు వారిని పోల్చడంలో తల్లిదండ్రులు కన్ఫ్యూషన్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. అలాగే చుట్టుపక్కల వారు, స్నేహితుల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిని అనుకోని మరొకరితో మాటలు కలిపేస్తూ ఉంటారు. అటువంటిది ఒకే చోట 20 మంది కవల పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి.? సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ ఒకటి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం బాలాజీ ప్రైవేట్ స్కూల్‌లో చోటు చేసుకుంది. అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది కవలలు చదువుతున్నారు. వాళ్లు కూడా ఆ స్కూల్ పరిసర ప్రాంతాలకు చెందినవారే కావడం విశేషం.

ఆ పది మంది కవలలు ఒకే రకమైన దుస్తులు, ఒకే రకమైన ముఖ కవళికలతో కనిపిస్తుంటే ఆ స్కూల్ టీచర్లు ఒకరి పేరుతో మరొకరిని పిలిచేవారట.  అంతేకాక గుర్తు పట్టడం కూడా చాలా కష్టంగా ఉండేదని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. అప్పుడప్పుడూ ఒకరికి శిక్ష విధించబోయే వేరొక విద్యార్థికి పనిష్‌మెంట్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలని వారు తమ అభిప్రాయాలను చెబుతూ నవ్వుకున్నారు.

For More News:

వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. బిల్లు చెల్లించకపోతే ఆటోమేటిక్‌గా పవర్ కట్..!

జగన్ మరో సంచలనం.. ఇక నుంచి ప్రజాసేవలో మంత్రులు కూడా..

బుమ్రాపై వేటు.. ఆ ఇద్దరికీ ఛాన్సు.. కోహ్లీ ఆలోచన సరైనదేనా.?

విషాదం: ఫ్లెక్సీ కడుతూ వైఎస్ జగన్ స్నేహితుడు మృతి..!

కిక్కిచ్చే వార్త.. లేడీస్ కోసం ప్రత్యేక మద్యం షాపులు..!